Sunday, May 8, 2016

రాజీవ్‌ కనకాలను కొట్టిన రష్మి

 ‘జబర్‌దస్త్‌’ షోలో తనదైన యాంకరింగ్‌ శైలితో అందరినీ అలరించింది రష్మి గౌతమ్‌. ఇటీవల ‘గుంటూరు టాకీస్‌’లో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ హాట్‌హాట్‌ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇప్పుడు ‘చారుశీల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్‌లో రాజీవ్‌కనకాలపై రష్మి దాడి చేసిందంట. ఈ విషయాన్ని రాజీవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘చారుశీల షూటింగ్‌లో రష్మి నాపై దాడి చేసింది. ఏమిటి రష్మిజీ ఇది. ఎవరైనా అడగండి ఏంటి పని’ అంటూ రాజీవ్‌ పోస్ట్‌ చేశారు.
ఈ చిత్రంలో రాజీవ్‌ బుగ్గ, నుదుటిపై రక్కేసినట్లు కనిపిస్తోంది. అసలు ఇలా జరగడానికి కారణం ఏమిటా అని నెటిజెన్లు ఆలోచనలో పడ్డారు. అసలు ఏం జరిగిందో రష్మినే చెప్పాలి మరి. ఇంకా ఈ విషయం సుమకు తెలుసో లేదో మరి.

నాని సినిమాలో అతిథిగా?

 దర్శకుడు రాజమౌళి తాను తీసే సినిమాల్లో ఏదో పాత్రలో కనిపించి, ప్రేక్షకులకు చిన్న సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. గత ఏడాది విడుదలైన ‘బాహుబలి’లో ఐటమ్ సాంగ్‌కి ముందు సీన్లో కాసేపు కనిపించారు. ఇప్పుడు నాని సినిమాలో కనిపించడానికి రెడీ అవుతున్నారన్న వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాని హీరోగా ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందునున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని ఓ దర్శకుడికి అసిస్టెంట్ డెరైక్టర్ పాత్రలోకనిపించనున్నారు. ఆ దర్శకుడి పాత్రలో కనిపించమని రాజమౌళిని అడిగితే, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

అతనెవరు?

 నాని హీరోనా... విలనా...? అంటూ ప్రేక్షకులకు పెద్ద పజిల్ ఇచ్చేశారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అదేంటీ అనుకుంటున్నారా? ఆయన దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘జెంటిల్‌మన్’ సినిమా టైటిల్‌కి  ‘హీరోనా? విలనా?’ అని ట్యాగ్‌లైన్ పెట్టిన విషయం గుర్తు చేయక్కర్లేదు. మరి.. ఈ జెంటిల్‌మన్ పాత్ర ఎలా ఉంటుందనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా  శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘ఈ నెల 12న టీజర్‌ను, 22న పాటలను విడుదల చే యనున్నాం. అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, కెమెరా: పీజీ విందా.