ఆ మధ్య వరకూ షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.
ఆ తర్వాత సీన్ మారింది. సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ పెళ్లి నుంచి ఈ
ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. ఆ తర్వాత తమ మధ్య ఉన్న
విభేదాలన్నింటినీ మరిచిపోయి ఇద్దరూ హ్యాపీగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు సల్మాన్‌ఖాన్ తాను షారుక్‌ఖాన్ అభిమానిని అని పేర్కొనడం బాలీవుడ్ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యాన్’ ప్రచార చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా కండలవీరుడు సల్మాన్ ‘‘బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ షారుక్’’ అంటూ ‘ఫ్యాన్’ ట్రైలర్ లింక్‌ను తన ట్విటర్‌లో షేర్ చేశారు. గత ఏడాది సల్మాన్ నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను షారుక్ ట్విట్టర్‌లో ఆవిష్కరిస్తే, ఆ తర్వాత షారుక్ నటించిన ‘దిల్‌వాలే’ చిత్రం డైలాగ్స్‌తో సల్మాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ టీమ్ డబ్‌స్మాష్ చేసింది.
ఇదంతా చూస్తుంటే, ఎలాంటి ఈగోలు లేకుండా సల్మాన్, షారుక్‌లు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, ఒకరి చిత్రాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పోటీనే... స్నేహం స్నేహ మే అన్న మాట. సల్మాన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. షారుక్ కూడా అంతే. కొత్తగా చిగురించిన ఈ ఇద్దరి స్నేహం ఎందాకా కొనసాగుతుందో కాలమే చెప్పాలి.