Tuesday, January 31, 2017

మర్చిపోలేని రోజు.. నాగచైతన్య

 అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఆదివారం రాత్రి ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఈ వేడుకకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. అయితే వీరందరికీ నాగచైతన్య మంగళవారం ట్విటర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దగ్గుబాటి కుటుంబం, అక్కినేని కుటుంబంతో కలిసి దిగిన చక్కని ఫొటోలను పోస్ట్‌ చేశారు. అది మర్చిపోలేని రాత్రని, కొత్త ఆరంభమని పేర్కొన్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్పారు.
చైతూ, సమంతల నిశ్చితార్థం పట్ల పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. జంట చక్కగా ఉందంటూ.. ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు. వీరిద్దరి పెళ్లి త్వరలోనే హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.