భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఇక్కడ అట్టహాసంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. భజ్జీ సహచరులు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, అశ్విన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్ తదితరులతో పాటు మాజీలు కపిల్‌దేవ్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే దీనికి హాజరయ్యారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. హర్భజన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి దాదాపు వేయి మంది ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.
Sunday, November 1, 2015
ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా...
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఇక్కడ అట్టహాసంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హాజరై దంపతులను ఆశీర్వదించారు. భజ్జీ సహచరులు విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, అశ్విన్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్, వరుణ్ ఆరోన్ తదితరులతో పాటు మాజీలు కపిల్‌దేవ్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే దీనికి హాజరయ్యారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా అతిథుల జాబితాలో ఉన్నారు. హర్భజన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి దాదాపు వేయి మంది ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.
' బాహుబలి-2' తర్వాత ప్రభాస్ పెళ్లికి గ్రీన్ సిగల్ ...
' బాహుబలి-2' తర్వాత ప్రభాస్ పెళ్లికి గ్రీన్ సిగల్ ఇచ్చాడు. ఇలీవల విడుదలైన '
బాహుబలి' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పడు అందరి దృష్టి ప్రభాస్
పెళ్లిపై పడింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లికి గ్రీన్ సిగల్ ఇచ్చాడు
సమాచారం. ఇంట్లో వారి ఒత్తిడి ఎక్కువగా
ఉండడంతో ఇక బ్యాచిలర్ లైఫ్‌కి
స్వప్తి చెప్పి మూడుముళ్లూ వేయాలని
డిసైడైపోయాడు తెలిసింది. ఇప్పుడు
మిగిలింది ' బాహుబలి-2' పూర్తవగానే వచ్చే ఏడాదిలో పెళ్లి ముహూర్తం ఉంటుందని
సమచారం. ' బాహుబలి-2' బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్
నటిస్తుందని
మీడియా సమాచారం.
సానియా అదరహో...
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబ్ల్యూటీఏ టూర్‌లో తన సత్తా
చాటింది. మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా
హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ ట్రోఫీని కైవసం
చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా జోడీ 6-0, 6-3 తేడాతో 8వ
సీడ్ ముగురుజ్జా-సూరేజ్ సవరో (స్పెయిన్) జంటపై విజయం సాధించింది. దీంతో ఈ
జోడీ సాధించిన టైటిల్స్ సంఖ్య 9కి చేరింది. వీరి ఖాతాలో వరుసగా 22వ విజయం
వచ్చి చేరింది. సానియా మీర్జాకు తన కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్.
హింగిస్‌కు 50వ డబుల్స్ టైటిల్.
Subscribe to:
Posts (Atom)