Sunday, September 27, 2015

నిమజ్జనానికి బయలుదేరిన ఘన నాథులు


నగరంలో గణేష్ శోభాయాత్ర ఘనంగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి ఘన నాథుల విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరాయి. సుందరంగా అలంకరించిన వాహనాలపై వినాయకుని విగ్రహాలను కొలువు తీర్చారు. వీనుల విందైన సినిమా, భక్తి గీతాలతో బొజ్జ గణపయ్య విగ్రహాల ముందు నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ మూషిక వాహనున్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వైపు తీసుకు వస్తున్నారు. గణపతి బొప్ప మొరియా, తుల్జ మొల్చి నౌకరియా అని ఏక దంతున్ని కొలస్తూ ముందుకు సాగుతున్నారు. సాయంత్రానికల్లా హుస్సేన్‌సాగర్ ప్రాంతం వినాయకుని విగ్రహాలతో తరలివచ్చే వాహనాలు, భక్తులతో రద్దీగా మారనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు రోడ్లపైకి చేరుకున్నారు. శోభాయాత్రను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.