Thursday, December 29, 2016

ఎక్కడైనా స్టార్‌ కానీ..అక్కడ కాదు!

 ‘ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో... ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం’ అనే సామెత ఉన్న విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమలో చాలామంది ఈ విధంగానే ఉంటారన్నది కొందరి ఊహ. ముఖ్యంగా పెద్దింటి కుటుంబాలకు చెందిన హీరోలు అంత ఫ్రెండ్లీగా ఉండరని ఊహించుకుంటారు. అయితే ఆ ఊహ నిజం కాదని కొన్ని సంఘటనలు చెబుతుంటాయ్‌. తాజాగా, ఓ ఫొటో ఆ విషయాన్ని మరింత బలంగా చూపించింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ చిరునవ్వులు చిందిస్తూ, దిగిన ఈ ఫొటో ఇక్కడిది కాదు. భార్యాపిల్లలతో కలసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి మహేశ్‌ విదేశాలు వెళ్లారు.
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ నగరంలో ఉన్నారు. రామ్‌చరణ్‌ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఇండియన్‌ స్టార్స్‌ అక్కడ సందడి చేశారు. ఫొటో దిగి, ‘బియాండ్‌ బౌండరీస్‌... హ్యాపీ హాలీడేస్‌’ అని మహేశ్, చరణ్‌ సోషల్‌ మీడియాలో పెట్టారు. ఎక్కడైనా స్టార్‌ కాని ఫ్రెండ్‌షిప్‌ విషయంలో స్టార్‌ కాదన్నట్లుగా మహేశ్‌ – చరణ్‌ చెబుతున్నట్లుంది కదూ. అనుకోకుండా కలిసినా స్టార్‌ స్టేటస్‌ని పక్కన పెట్టి, ఇలా కాసేపు ఫ్రెండ్లీగా హాలిడేస్‌ని ఎంజాయ్‌ చేయడం స్నేహపూరిత వాతావరణాన్ని తెలియజేస్తోంది.

మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం!

గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో న్యూఇయర్ వేడుకల్ని సెలబ్రెట్ చేసుకోబోతున్న ఈ జంట..  జనవరి 1వ తేదీన నిశ్చితార్థం చేసుకునే యోచనలో ఉన్నారు. 2017లో జీవితంలో స్థిరపడాలని భావిస్తున్న విరాట్-అనుష్కలు.. కొత్త ఏడాది ఆరంభపు కానుకగా నిశ్చితార్థాన్ని చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
 
ఇందుకు ఉత్తరాఖండ్ లోని నరేంద్ర నగర్ లోని హోటల్ ఆనందాలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి అనుష్క శర్మ తరపున కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో ఇరు కుటుంబాల పెద్దలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై విరాట్ కోహ్లి కానీ, అనుష్క శర్మ కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరం సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఉత్తరాఖండ్ విహారానికి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే.  గత కొన్నేళ్లుగా  ప్రేమించుకుంటున్న ఈ జంట... శనివారం ఉత్తరాఖండ్ ఎయిర్ పోర్ట్ ల దర్శనిమిచ్చింది.
 
ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ముగిసి విరాట్ కోహ్లికి కావాల్సిన విశ్రాంతి దొరకడంతో ప్రియురాలు అనుష్కతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోనున్నాడు. దీనిలో భాగంగానే ఈసారి ఆ జంట ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని న్యూఇయర్ వేడుకలకు ఎంచుకుంది. గతేడాది నూతన సంవత్సర వేడుకల్ని విరాట్-అనుష్కలు విదేశాల్లో జరుపుకున్నారు.