ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే, ట్వంటీ20 క్రికెట్ మ్యాచ్‌కు భారత జ ట్టు సిద్ధమైంది. అయితే ఎంపిక జట్టులో గాయంతో బ్యాట్స్‌మన్ యువరాజ్, ఆల్‌రౌండర్ హర్భజన్ దూరమయ్యారు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లను ఓడిపోయిన భారత్ వన్డే జట్టులోకి సెహ్వగ్, గంభీర్ కోహ్లీ, శర్మ వచ్చి చేరారు. ఇదిలా ఉంటే హిట్ ప్లేయర్ యువరాజ్ గాయం వల్ల బాధపడుతుండటంతో దాదాపు రెండేళ్ల అనంతరం మిస్టర్ వాల్ రాహుల్ ద్రవిడ్‌కు వన్డే జట్టులో ఆడే అవకాశం దక్కింది. 2009 సెప్టంబర్‌లో చాంపియన్స్ టోఫ్రీలో భాగంగా దక్షిణాఫ్రికాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ద్రవిడ్ భారత తరపున వన్డేలో ఆడాడు. మరోవైపు భారత్‌ను గాయాల భూతం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. మొన్న జహీర్, గంభీర్ తీవ్రమైన నొప్పితో రెండవ టెస్టుకి దూరమమైతే ఇపుడు వన్డే జట్టుకు యువరాజ్, భజ్జీ దూరమైయారు. ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనలో బౌలింగ్‌లో ఎలాంటి ప్రభావం చూపించని భజ్జీ కడుపు కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. ‘ ఇంగ్లాండ్ పరిస్థితులను ఆధారంగా చేసుకునే జట్టును సెల క్ట్ చేశాం. ఎంపిక ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించాము’ అని సెక్షన్ క మిటి ఛీఫ్ శ్రీకాంత్ విలేఖరులతో చెప్పారు. ఆఫ్ స్పిన్నర్, హర్భజన్, బ్యాట్స్‌మన్ యువరాజ్ ఇద్దరిని మినహాయించి 15 మంది సభ్యులతో జట్టును ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే, ట్వంటీ20కి ఎంపిక చేశారు
చిరంజీవి ఏకైక కుమారుడు రాంచరణ్ తేజకు అపోలో గ్రూపు సంస్థల ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు ఉపాసనతో తర్వలో వివాహం జరగనుంది. రెండు రోజుల్లో ఈ వివాహానికి సంబంధించిన ఇరు కుటుంబాలు ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి. రాంచరణ్, ఉపాసన చైన్నెలో కలిసి చదువుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు చిరంజీవి సిద్దమవుతున్నారు. అపోలో గ్రూపు ఛైర్మన్ మనవరాలితో తన కుమారుడు రాంచరణ్ తేజ్‌కు వివాహం నిశ్చయం కానున్న విషయాన్ని చిరంజీవి నేడు ధ్రువీకరించాడు. ఈ ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.