ఇప్పుడు అమలా పాల్ వయసు 24 ఏళ్లు మాత్రమే. మరి, ఇటు 33... అటు 61
ఏంటనుకుంటున్నారా? హీరోల వయసండీ. సిల్వర్ స్క్రీన్‌పై ఓ పక్క యంగ్ హీరోలతో
రొమాన్స్ చేస్తున్న ఈ మలయాళీ బ్యూటీ, మరో పక్క సీనియర్ హీరోల సరసన కూడా సై
అంటున్నారు. ఇప్పుడీ బ్యూటీ నటిస్తున్న తమిళ సినిమా ‘వడ చెన్నై’ హీరో ధనుష్
వయసు 33 ఏళ్లు. యంగ్ హీరోల సినిమాల్లో మంచి చాన్సులు వస్తున్నప్పుడు
సీనియర్ హీరోల పక్కన నటించడానికి అమలా పాల్ వయసున్న హీరోయిన్లు
ఆలోచిస్తారు. ఎందుకంటే.. సీనియర్ హీరోయిన్ కింద ట్రీట్ చేసి, యంగ్ హీరోలు
చాన్సులు ఇవ్వరేమోననే భయం.
కానీ, అమలా పాల్‌కి అటువంటి భయాలు ఉన్నట్లు కనిపించడం లేదు. 33 ఏళ్ల ధనుష్ సరసన నటిస్తూనే, 61 ఏళ్ల సత్యరాజ్ పక్కన నటించడానికి సంతకం చేసేశారు. మోహన్‌లాల్, అమలా పాల్ జంటగా నటించిన మలయాళ సినిమా ‘లైలా ఓ లైలా’ను సత్యరాజ్ హీరోగా తమిళంలో ‘మురుగవేల్’గా రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌లో పోషించిన పాత్రనే మళ్లీ తమిళంలో చేస్తున్నారు అమలా పాల్. 61 ఏళ్ల సత్యరాజ్ పక్కనే కాదు.. మరో నాలుగేళ్లు పెద్దైన రజనీకాంత్ సరసన కూడా ఆమె నటించనున్నారట.