శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో
నాగశౌర్య, నారా రోహిత్ ప్రధాన
పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న
చిత్రం ‘జ్యో అచ్యుతానందా’.
ఈ చిత్రం సెట్‌లో యూనిట్ సభ్యులు
చాలా సరదాగా గడుపుతున్నారు.
ఈ సందర్భంగా దిగిన ఒక ఫొటోను
శ్రీనివాస్ అవసరాల తన ఫేస్‌బుక్
ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
అందులో నాగశౌర్య స్కెచ్‌లు
పట్టుకుని ఉండగా.. శ్రీనివాస్
అవసరాల చేతికి కట్టుకట్టి ఉంది.
ఈ కట్టుపై ‘సువర్ణ’ అని రాసి
ఉంది. దీనికి శ్రీనివాస్ క్యాప్షన్‌గా...
‘నేను అతడి కోసం రెండు స్క్రిప్టులు
రాశాను. నా కోసం అతడు ఇది రాశాడు’
అని పోస్ట్ చేశారు. మరి ఆ ‘సువర్ణ’
అనే పేరు సినిమాలో హీరోయిన్‌దా..
లేక మరేదైనా ఉందా అన్న విషయం
తెలియాల్సి ఉంది.
Saturday, May 28, 2016
'బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ కు నాదే బాధ్యత'
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు భారీ విజయం తర్వాత విడుదలైన ఆయన సినిమా బ్రహ్మోత్సవంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ అభిమానుల అంచనాలను బ్రహ్మోత్సవం అందుకోలేకపోయింది. అభిమానులను నిరాశపరిచిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది.
బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ కు దర్శకుడిని నిందించరాదని మహేష్ బాబు అన్నాడు. ఓ జాతీయ వార్త సంస్థతో మహేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా పరాజయానికి పూర్తిగా తనదే బాధ్యతని చెప్పాడు. ఓ సినిమా హిట్ కావడానికి, కాకపోవడానికి ఎన్నో కారణాలుంటాయని అన్నాడు. దర్శకుడిని ఎంచుకోవడమన్నది తన నిర్ణయమని, నా అభిప్రాయం తప్పుకావచ్చని మహేష్ చెప్పాడు.
మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇంకా సత్యారాజ్, రావు రమేష్, నరేశ్, రేవతి, సాయాజీ షిండే తదితర భారీ తారగణం నటించారు.
Subscribe to:
Posts (Atom)