లోకనాయకుడు,
నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గుర్తింపు
తెచ్చుకుంది నటి శ్రుతీహాసన్. అయితే కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా
ఉంటోంది ఈ భామ. తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్స్‌లేతో షికార్లు చేస్తూ బిజీ
బిజీగా ఉంది. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వదంతులు ప్రచారంలో
ఉన్నాయి.
ఏడాది నుంచి శ్రుతి ఏ సినిమా చేయకపోయినా... తెరపై
అభిమానులకు కనిపించకపోయినా. ట్వీటర్‌లో మాత్రం ఆమె హవా కొనసాగిస్తోంది.
భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్,
మోహన్‌లాల్ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచింది శ్రుతి.
ఏడు మిలియన్ల మంది అభిమానులు ట్వీటర్‌లో ఈ నటిని ఫాలో అవుతున్నారు.
సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆమె హవా మాత్రం తగ్గలేదంటున్నారు
నెటిజన్లు. నటి సమంత, శ్రుతికి కాస్త దగ్గర్లో ఉంది. సమంతను ట్వీటర్‌లో
6.53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.