వచ్చే అదృష్టాన్ని నిలువరించడం ఎవరితరం కాదు. అలాగే అందని దాని కోసం ఆశ
పడడం వృథానే. అలాగని కలల్ని కనడం, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయడం
సాధికుల లక్షణం. అదే విధంగా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం
తెలివైన వారి పని. ఇక సినీ కథానాయికల విషయానికొస్తే వరించి వచ్చిన
అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగే వారు కొందరైతే, కోరుకున్న అవకాశాలను
సంపాదించుకునే వారు మరి కొందరు. మొదట నుంచి అందాలార బోసి కమర్షియల్
హీరోయినన్ లగా పేరు తెచ్చుకుని నటిగా ఒక స్థాయికి చేరిన తరువాత కథలో
సెంటరిక్ పాత్రలను పోషించాలని ఆశ పడుతుండడం సహజం.
అయితే ఆశపడిన వారందరికీ అలాంటి అవకాశాలు రావడం అన్నది కల్లే. కొందరికి
మాత్రం ఆశించకుండానే హీరోయిన్ ఓరియెంటెడ్ అవకాశాలు ముంగిట వాలతాయి.
ఒకప్పుడు నటి విజయశాంతి అలాంటి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించి
లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. తాజాగా నటి నయనతార, అనుష్క, త్రిష లాంటి
వారు కథల్లో సెంటరిక్ పాత్రలో రాణిస్తున్నారు. ఇటీవల నటి సోనియా
అగర్వాల్ కూడా లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న
అహల్య అనే చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. కాగా నటి కాజల్‌అగర్వాల్‌కు
కూడా స్త్రీ ప్రధాన పాత్రతో కూడిన చిత్రాల్లో నటించాలన్న ఆశ పుట్టింది.
ఇప్పటి వరకూ గ్లామరస్ పాత్రలకే పరిమితవైున ఈ బ్యూటీ కెరీర్ మధ్యలో కాస్త
డౌన్ నా మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం అజిత్‌తో వివేకం చిత్రంలోనూ,
విజయ్‌తో ఆయన 61వ చిత్రంలోనూ రొమాన్స్ చేస్తున్న ఈ ఉత్తరాది భామ
కోరుకున్నట్లు తాను ఆశపడిన పాత్రలో నటించే అవకాశం వరించిందన్నది తాజా
సమాచారం. దర్శకుడు డీకే నయనతార కోసం ఒక హీరోయిన్ సెంటరిక్ కథను తయారు
చేసుకున్నారు.
ఈ పాత్రలో ఇప్పుడు నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్నారు. కాజల్
ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో కవలైవేండామ్ చిత్రంలో నటించారు. ఆ స్నేహం
కారణంగానే ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం కాజల్‌ను
వరించిందని తెలుస్తోంది. మొత్తం మీద కాజల్ కోరుకుంది సాధించుకుంది.
ఇప్పుడు ఈ అమ్మడు కూడా నయనతార, త్రిషల వరుసలో చేరబోతున్నందుకు ఆనందంలో
తేలిపోతోందట. లక్కు అంటే ఇదే మరి.