పర్యాటక ఇంగ్లాండ్ జట్టుతో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో యువరాజ్,
ధోనిలు చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. ఈ జోడీపై ఒకప్పటి డాషింగ్ ఓపెనర్,
ట్విటర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు.
మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన 35 ఏళ్ల యువీ అసాధారణ ఆటతో 150, కెప్టెన్సీ
నుంచి వైదొలిగిన ధోని 134 పరుగులతో రాణించారు. దీంతో మాజీ క్రికెటర్లు,
సినీ ప్రముఖులు, వ్యాఖ్యాతలు సైతం వీరిద్దరినీ ఆకాశానికెత్తేస్తున్నారు.
‘పాత నోట్లు మాత్రమే చలామణిలో లేవు. యువరాజ్, ధోనిల ఆట మాత్రం అందుబాటులోనే ఉందని’ తన తొలి ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘ఈ వ్యక్తి క్యాన్సర్‌ను జయించాడు. అతడు మాత్రమే ఈ రోజు ఇంగ్లీష్ బౌలర్లను ఓడించాడు. సాధించేదాకా పట్టు వదలని తత్వాన్ని అతడి (యువీ) దగ్గర నుంచి నేర్చుకోవాలని’ యువరాజ్‌సింగ్‌ను ఉద్దేశించి సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. మైదానంలో యువీ, ధోనిల ఫోటోతో పాటు యువరాజ్‌సింగ్ క్యాన్సర్ చికిత్స చేయించుకున్న తర్వాత తీసిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.