టాలీవుడ్, కోలీవుడ్‌లలో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అనుష్క తాజాగా తమిళ హాస్యనటుడు సంతానంతో కలిసి ఓ సినిమాలో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుందన్న ప్రచారం ప్రస్తుతం కోలీవుడ్‌లో వినపడుతోంది. ఇంతకుముందు ప్రముఖ తమిళ నటుడు ఆర్య హీరోగా నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాన్ని దర్శకుడు రాజేష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆర్యతో పాటు అతడి స్నేహితుడిగా సంతానం కామెడీ పాత్రలో చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇప్పుడు రాజేష్ దర్శకత్వంలోనే తెరకెక్కే కొత్త చిత్రంలో వీరిద్దరు కలిసి నటించనున్నారు. ఈ సినిమాలో ఆర్య సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సంతానం సరసన అనుష్కను నటింపజేయాలని చిత్రదర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారట. దర్శకుడు రాజేష్ లింగా చిత్రం షూటింగ్ స్పాట్‌కు వెళ్లి ఆమెను సంప్రదిస్తే ఆమె వెంటనే ఒప్పుకుందని టాక్. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేష్, హీరో ఆర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో వినపడుతున్న టాక్ ఏంటంటే ఎలాగు భారీ చిత్రాలు అయిపోతే తర్వాత అనుష్క చేతిలో పెద్ద ప్రాజెక్టులేమి లేవు. ఆమెకు ఇప్పటకే 34 సంవత్సరాలు వచ్చేశాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు వయస్సలో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోపోతే ఎందుకన్నట్టు కామెడీ నటుల పక్కన కూడా హీరోయిన్‌గా నటించేందుకు ఒప్పేసుకుంటుందని గుసగుసలాడుకుంటున్నారు.