ప్రపంచకప్‌ను వరకు శ్రీలంకకు కెప్టన్‌గా సంగక్కర ఉన్నాడు. ఇప్పుడు కొత్త కెప్టెన్‌గా ఓపెనరు దిల్షాన్ నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. 34 సంవత్సరాల దిల్షాన్ ప్రస్తుతం ఐపీఎల్-4లో రాయల్ ఛాలెంజ్సర్ బెంగుళూరు జట్టులో అడుతున్నాడు. దిల్షాన్ 66 టెస్ట్‌ల్లో 42.44 సగటుతో 3990 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు, 16 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో 203 మ్యాచ్‌ల్లో 36.61 సగటుతో, 10 సెంచరీలు, 50 అర్థసెంచరీలతో 5456 పరుగులు చేశాడు.