Saturday, May 21, 2016

తెలుగులో బంగారం..హిందీలో జాను!


 
దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే బంగారం’ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దుల్కర్, నిత్యల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తెలుగులోనే కాదు తమిళంలో (‘ఓకే కన్మణి’)  కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ‘ఓకే జాను’ పేరుతో బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఆదిత్యా రాయ్, శ్రద్ధా కపూర్ జంటగా షాద్ అలీ దర్శకత్వంలో ప్రముఖ దర్శక- నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘ఓకే జాను’ని విడుదల చేస్తున్నట్లు కరణ్ ప్రకటించారు. అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

చిరుతో చిందేయనున్న ఎమ్మెల్యే


చిరంజీవి 150వ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచి రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమాకు పనిచేయబోయే సాంకేతిక నిపుణుల నుంచి నటీనటుల వరకు రకరకాల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికీ హీరోయిన్ల విషయంలో క్లారిటీ రాకపోయినా ఇద్దరు సీనియర్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వరుసగా సీనియర్ హీరోలతో జతకడుతున్న నయనతార దాదాపు కన్ఫామ్ అని భావించారు. అయితే ఇప్పుడు కొత్తగా అనుష్క పేరు తెర మీదకు వచ్చింది. ఇంకా హీరోయిన్ పేరు ఫైనల్ కాకముందే స్పెషల్ సాంగ్ లో ఆడిపాడేందుకు ఓ కుర్ర హీరోయిన్ను ఫైనల్ చేశారట. ఈ మధ్యే సరైనోడు సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ సరసన గ్లామరస్ ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్ థెరిస్సా, మెగాస్టార్ 150వ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట. అంతేకాదు కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా ఈ అమ్మడు కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ లో బిజీగానే ఉన్నా తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేథరిన్ కు ఇది గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.