Saturday, November 29, 2014

మేము సైతం


             హుదూద్‌ తుపాన్‌ బారిన పడి భారీగా నష్టపోయిన వైజాగ్‌ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సహాయార్థం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ' మేముసైతం' పేరుతో ఓ ఈవెంట్‌ నిర్వహించనుంది. నవంబర్‌ 30న జరిగే ప్రోగ్రామ్‌ కోస ప్రత్యేకంగా మేముసైతం డాట్‌ కామ్‌ అనే పేరుతో వైబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రామ్‌ని అందరూ లైవ్‌లో చేసే విధంగా జెమిని, మామూవీ చానల్స్‌ ద్వారా ప్రత్యేక సమాచారం అందిస్తున్నాం.
'' హుదూద్‌ తుపాన్‌ భాధితుల కోసం చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తమ వంతుగా సాయాన్ని అందించారు. ఇప్పుడు మరికొంత సాయాన్ని ఇండిస్టీ నుంచి అందించాలన్న ఉద్దేశంతో నవంబర్‌ 30న మేము సైతం అనే ఈవెంట్‌ని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నాం. ఈ ప్రోగ్రామ్‌ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. ఈ షోలో మ్యూజికల్‌ షోలు, గేమ్‌షోలు వుంటాయి. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌ను ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారు చూసేవిధంగా ఫ్లాన్‌ చేస్తున్నాం.

క్రికెట్‌ టోర్నమెంట్‌                        హుదూర్‌ తుపాన్‌ బాధితులకు తమ వంతు సాయం అందించేందుకు నవంబర్‌ 30న '' మేము సైతం '' కార్యక్రమాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేపట్టిన విషయం తెలిసిందే. నవంబర్‌ 30 మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి హైదరాబాద్‌లోని కోట్ల విజయబాస్కర్‌రెడ్డి స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రికెట్‌ ట్రోఫీ మ్యాచ్‌లలో నాలుగు టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఈ టీమ్‌లను డ్రా పద్దతిలో సెలెక్ట్‌ చేశారు. నాలుగు టీమ్‌లకు కెప్టెన్‌గా నాగార్జున, వెంకటేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కెప్టెన్లుగా వ్యవహారించనున్నారు. ఒక్కో టీమ్‌లో 16 మంది సభ్యులుంటారు.
నాగర్జున జట్టుకి అఖిల్‌ వైస్‌ కెప్టెన్‌ : కల్యాణ్‌రామ్‌, నిఖిల్‌, నరేష్‌, సాయికుమార్‌, శర్వానంద్‌, సచిన్‌జోషి, నాగశౌర్య, రాజీవ్‌ కనకాల, శివాజీరాజా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రణీత, సోనియా, దిశాపాండే, మధుశాలిని ప్లేయర్స్‌గా ఉంటారు.
వెంకటేష్‌ జట్టుకి మంచు విష్ణు వైస్‌ కెప్టెన్‌ : నారా రోహిత్‌, డా. రాజశేఖర్‌, నితిన్‌, మనోజ్‌ దాసరి, అరుణ్‌ నవీన్‌చంద్ర, సుశాంత్‌, మాదాలరవి, సమంత, ఆదర్శ్‌, మంచు లక్ష్మీ, సంజన, ప్రియబెనర్జీ, తేజస్వి, ప్లేయర్స్‌గా ఉంటారు.

ఎన్టీఆర్‌ జట్టుకి శ్రీకాంత్‌ వైస్‌కెప్టెన్‌ : రవితేజ, నాని, సాయిధరమ్‌తేజ, తనీష్‌, థమన్‌, ప్రిన్స్‌, సందీప్‌కిషన్‌, రఘు, సమీర్‌, అనుష్క, దీక్షాసేథ్‌, శుభ్రఅయ్యప్ప, నిఖిత, అస్మితాసూద్‌ ప్లేయర్స్‌గా ఉంటారు. 

రామ్‌చరణ్‌ జట్టుకి తారకరత్న వైస్‌కెప్టెన్‌ :
సుధీర్‌, సుమంత్‌, గోపీచంద్‌ వడ్డేనవీన్‌, వరుణ్‌సందేశ్‌, ఖయ్యూమ్‌, అజరు, కాజల్‌, ఛార్మి, పూనమ్‌కౌర్‌, ఆది, అర్చన, రీతూ వర్మ టీమ్‌ సభ్యులుగా ఉంటారు.