శత్రువులపై కన్నెర చేసే సింహం.. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే
ఆపద్బాంధవుడు.. సమాజం కోసం పాటుపడే మంచి సంఘ సంస్కర్త... టోటల్‌గా
మంచితనానికి చిరునామా కబాలి. ఈ మాఫియా డాన్ లక్ష్యం ఏంటి? అనేది
ప్రస్తుతానికి సస్పెన్స్. టైటిల్ రోల్‌లో రజనీకాంత్ హీరోగా పా. రంజిత్
దర్శకత్వంలో ‘కలైపులి’ ఎస్. థాను నిర్మిస్తున్న ‘కబాలి’ ఫస్ట్ లుక్‌కి భారీ
ఎత్తున స్పందన లభించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో
రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా ‘కలైపులి’ ఎస్. థాను మాట్లాడుతూ - ‘‘రజనీకాంత్‌తో సినిమా నిర్మించాలన్న నా కల ఈ చిత్రంతో నెరవేరింది. మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో ఆయన గెటప్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. రంజిత్ మంచి స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఏప్రిల్ మొదటి వారంలో టీజర్‌ను, రెండో వారంలో పాటలను, వేసవి కానుకగా మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహితి, సంగీతం: సంతోశ్ నారాయణ్, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్, అనంతశ్రీరామ్, కెమెరా: మురళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవి-శ్రీదేవి సతీశ్.