Thursday, February 10, 2011

మరో సినిమా 'తెలంగాణ జిందాబాద్‌'

గతంలో 'హనీమూన్‌' అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఎం.ఎస్‌. గుప్తా ఈసారి తెలంగాణా పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. 'తెలంగాణ జిందాబాద్‌' అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'గతంలో 'హనీమూన్‌' తీశాను. నాలుగు భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలంగాణా బిడ్డగా తెలంగాణా అవసరం ఏమిటనేది... చూపించబోతున్నా. నటీనటులు, టెక్నీషియన్స్‌ వివరాలు త్వరలో వెల్లడిచేస్తా'నని అన్నారు.

ఇలియానా ..... సైడ్‌ బిజినెస్‌

 సినీపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న ఇలియానకు డబ్బు పిచ్చి పట్టిందెమోగాని ఈ మధ్య ఎక్కువగా సైడ్‌ బిజినెస్‌ దృష్టిపెట్టుతుంది. కొంతమంది బామలు ఆఫర్లు లేక ఏమి చేయ్యలేని పరిస్థితిలో ఉంటే ఇలియానా మాత్రం సైడ్‌ బిజినెస్‌పై దృష్టి సాధింస్తుంది. ఇంతకీ ఇలియానా బిజినెస్‌ ఏమిటో తెలసా...? వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టాలని సన్నాహాలు చేస్తుంది. అన్నట్లు వస్త్రాల పేరేమిటో తెలుసా ... ఇలియానా. తన తొలి బ్రాంచ్‌ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయబోతుందంట. తర్వాత గోవాలో కూడా ఆ బిజినెస్‌ ప్రారంభించిందట. ఎందుకు ఈ బిజినెస్‌ పెట్టాలనుదో తెలుసా ..... ఇలియాన తల్లి సమీరా ఆ వస్త్రాలను డిజైన్‌ చేస్తుందట. ఇప్పటివరకు ఇలియానా నటించిన సినిమాలకు సమీరానే డిజైనర్‌గా వ్యవహరించారట. చేతిలో పనే కదా అందుకే మరింత కాసులు దండుకోవాలని ఇలియానా ఈ ప్లాన్‌ చేసివుంటుందని అనుకుంటున్నారు పబ్లిక్‌.

రగడ అర్థ శతదినోత్సవం

 నాగార్జున నటించిన 'రగడ' ఫిబ్రవరి 11 నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. క్రిస్మస్‌ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా, 89 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విషయమై నాగార్జున స్పందిస్తూ...'పాటలు, ఫైట్స్‌, డైలాగ్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చేలా కమర్షియల్‌గా పెద్ద హిట్‌. ఫిబ్రవరి 11 నాటికి 50 రోజులు పూర్తి చేసుకోవడం, ఇదే రోజున దిల్‌రాజు బ్యానర్‌లో చేసిన 'గగనం' రిలీజ్‌ అవడం, రేపు ఫిబ్రవరి 12న ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో శ్రీనివాస్‌రెడ్డి డైరెక్షన్‌లో 'ఢమరుకం' షూటింగ్‌ ప్రారంభం అవుతుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. 'రగడ'ను ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు' అని అన్నారు. నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ..'సంక్రాంతి పండగకు మంచి కలెక్షన్స్‌ రాబట్టి ఇప్పుడు రాబోయే శివరాత్రి వరకు తన జైత్రయాత్రని కొనసాగిస్తుందన్న నమ్మకం వుంది. 89 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని, అన్ని సెంటర్స్‌లో స్ట్రాంగ్‌గా వుండటం హ్యాపీగా వుంది. 'రగడ' చిత్రాన్ని మా బ్యానర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌. ఆదరించిన ప్రేక్షకులకు, నాగార్జునగారి అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా'నని అన్నారు.

దొంగల ముఠా మూవీ స్టిల్స్‌

                                               దొంగల ముఠా మూవీ స్టిల్స్ 




  






 



దక్షిణాఫ్రికా జట్టు రాక

వరల్డ్‌కప్‌కు గట్టిపోటీదారులైన దక్షిణాఫ్రికా జట్టు బుధవారం ఉదయం ఇక్కడకు చేరుకుంది. ఇప్పటివరకు ప్రపంచకప్‌ను ఒక్కసారి కూడా గెలుచుకోలేకపోయిన ఆ జట్టు ఈ సారి విజేతగా స్వదేశానికి తిరిగివెళ్లాలనే పట్టుదలతో వచ్చింది. గ్రీమ్‌ స్మిత్‌ నేతృత్వంలోని ఆ జట్టులో హసీం ఆమ్లా, డివిల్లీర్స్‌, జెపి డ్యూమినీ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే అందరి చూపు బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ జాక్స్‌ కల్లిస్‌పై ఉంటుందనడంలో అతి శయోక్తి లేదు. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో కల్లిస్‌ అద్భు తంగా రాణించాడు. ఐసిసి నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ దక్కించుకున్న డేల్‌ స్టెన్‌, మార్నే మోర్కెల్‌, కొత్తకుర్రాడైన ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సత్తా చాటుకున్న సొసోబే వంటి క్రీడాకారులతో దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్‌ లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టు బలంగా ఉంది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-2తో గెలుచుకున్న ఆ జట్టు ఉత్సాహంతో ఉరక లేస్తోంది. ఆ జట్టు గ్రూప్‌ బిలో ఉంది. భారత్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఐర్లండ్‌, నెదర్లాండ్స్‌ ఈ గ్రూప్‌లోని మిగిలిన జట్లు. ప్రపంచకప్‌ సమ రానికి దిగేముందు ఈ నెల 12న జింబాబ్వేతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడు తుంది. వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ను వెస్టిండీస్‌ తో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో ఈ నెల 24న ఆడుతుంది.