సూర్య కథానాయకుడిగా ‘సింగం’
సిరీస్‌లో వచ్చిన చిత్రం ‘ఎస్3’.
అనుష్క, శ్రుతిహాసన్ కథానాయికలు.
హరి దర్శకుడు. ఇటీవల విడుదలైన
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి
విజయాన్ని అందుకుంది. మంగళవారం
హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ
కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ..
‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్.
ఎందుకంటే విడుదల తేదీ ఇప్పటికే
చాలా సార్లు మారింది. సినిమా
ఎప్పుడు విడుదలవుతుందనేది
మన చేతుల్లో లేదు. నేను చాలా
కంగారు పడ్డాను. కానీ ప్రేక్షకుల
చిత్రాన్ని ఆదరించారు. దక్షిణాదిన
ఏటా సుమారు వెయ్యికు పైగా సినిమాలు
విడుదలవుతుంటాయి. అందులో ఏడు
శాతం మాత్రమే విజయం సాధిస్తుంటాయి.
అందుకే ప్రతి నటుడికీ హిట్
అనేది ప్రత్యేకం. మా నాన్నగారు
నన్ను ఆలింగనం చేసుకొని అభినందించటం
చాలా అరుదైన విషయం. అలాంటిది
ఆయన ఈ సినిమా చూసి నన్ను ప్రేమగా
ఆలింగనం చేసుకున్నారు. అంతకంటే
సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది.
అందుకే దర్శకుడు హరికి ప్రత్యేకంగా
కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమా
కోసం ఆయన చాలా కష్టపడ్డారు.
ఆయనతో మరో సినిమా చేస్తాను.
సింగం సిరీస్‌ను కొనసాగించే
అవకాశాలూ ఉన్నాయి. అన్నీ కుదిరితే
‘సింగం 4’తో వస్తాం. కానీ దానికి
ఐదారేళ్లు పట్టొచ్చు.’ అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ.. ‘గతంలో వచ్చిన ‘సింగం’ చిత్రాలలాగానే దీనికి కూడా చాలా కష్టపడినట్లు తెలిపారు. తనకు ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రమంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఆయనతో కలిసి ఓ పవర్‌ఫుల్ చిత్రాన్ని చేయాలనుకొంటున్నట్లు వెల్లడించారు.