రణభీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల
ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. గత ఐదేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతోంది.
ఇదిలావుండగా ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో
హాట్‌టాపిక్‌గా మారాయి. వివాహం చేసుకోకుండానే కొన్నేళ్లుగా ఈ ప్రేమికుల జంట
సహజీవనం చేస్తోంది. ప్రియురాలి కోసం రణభీర్‌కపూర్ తన సొంతం ఇంటిని
విడిచిపెట్టిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవలే పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయించారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కత్రినాకైఫ్‌తో వివాహానికి రణభీర్ కపూర్ తండ్రి రిషికపూర్ తొలుత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, అయితే కొందరు బాలీవుడ్ పెద్దల మధ్యవర్తిత్వంతో ఆయన వివాహానికి అంగీకరించారని అంటున్నారు. పెళ్లి ఫిబ్రవరి నెలలో జరగొచ్చని తెలుస్తోంది. అత్యంత వైభవంగా విహాహాన్ని జరిపించేందుకు రిషికపూర్ కుటుంబం సన్నాహాలు చేసుకుంటోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.