సినిమాలో సాధించడానికి నటీమణుల కు ధైర్యం చాలా అవసరం అంటున్నారు నటి
తమన్నా. ఏమిటీ చాలా మంది శ్రమ, కృషి, ప్రతిభ అన్నింటికీ మించి అదృష్టం
ఉండాలంటుంటారు. అలాంటిది ఈ మిల్కీబ్యూటీ ైధైర్యం
కావాలంటున్నారేమిటనుకుంటున్నారా? అదేమిటో తమన్నా మాటల్లోనే చూద్దాం. నేను
చిత్ర రంగప్రవేశం చేసి చాలా ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ తమిళం, తెలుగు,హిందీ
భాషల్లో ప్రము ఖ నాయకిగానే వెలుగొందుతున్నాను. ఇన్నేళ్లలో సినిమా నాకు
చాలానే నేర్పించింది. కొత్తలో నటినవ్వాలన్న ఆసక్తి మినహా వేరేమీ తెలియదు.
నేను ఉత్తరాది సంస్కృతిలో పెరిగిన యువతిని. అలాంటిది దక్షిణాది చిత్రాల్లో
అవకాశాలు వచ్చాయి. ఇక్కడ భాష తెలియదు. సంస్కృతి, సంప్రదాయాలు అస్సలు
తెలియవు.
అయినా ఇక్కడి చిత్రాల్లో నటించడం మొదలెట్టాను. ఎలాంటి భయానికి గురి
కాలేదు. ధైర్యం మాత్రమే నాలో ఉంది. అదే నన్ను ఉన్నత స్థాయికి చేర్చింది.
తెలి యని భాష అని అప్పుడు భయపడి ఉంటే నటిగా ఇంత గుర్తింపు తెచ్చుకునే
దానిని కాదు. అందుకే అంటున్నా నటీమణులు సాధించాలంటే చాలా ధైర్యం అవసరం.
సినిమా జయాపజయాల గురించి నేను చింతించను. కఠనంగా శ్రమిస్తాను. చిత్ర
జయాపజయాలన్నవి ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది.
నా వరకు నేను నటిగా చాలా సంతోష జీవితాన్ని అనుభవిస్తున్నాను. అనుభవా లు
చాలా పాఠాలు నేర్పాయి. అవే ఇప్పుడు జీవితాన్ని ఎలా మలచుకోవాల న్న పరిణితిని
కలిగించాయి. అంటున్న తమన్నా ప్రస్తుతం తమిళం,తెలుగు,హింది భాషల్లో నటిస్తూ
బిజీగా ఉన్నారు. తమిళంలో విజయ్‌సేతుపతికి జం టగా ధర్మదురై చిత్రంలోనూ,
తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న బ్ర హ్మాండ చిత్రం బాహుబలి-2 చిత్రంతో
పాటు హిందీలో రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌సింగ్‌కు జంటగా నటిస్తూ
బిజీగా ఉన్నారు.