తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో సచిన్ ర్యాంకు మెరుగు పడగా, ద్రవిడ్ టాప్ టెన్ నుంచి పడిపోయాడు. తొలి టెస్టులో హాఫ్ సెంచరీతో రాణించిన సచిన్ నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్ కలిస్‌తో కలిసి ర్యాంకును పంచుకున్నాడు. మరోవైపు ద్రవిడ్ రెండు స్థానాలు దిగజారి 11వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు. బౌలర్లలో జహీర్ ఆరోర్యాంకుతో సరిపెట్టుకోగా.. ఆసీస్ పేసర్ పీటర్ సిడిల్ మూడు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరాడు. సౌతాఫ్రికాపై చెలరేగిన హెరాత్ కూడా ఏడోస్థానంలో నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పాటిన్సన్, భారత్ యంగ్ గన్ ఉమేష్ యాదవ్ ఐదు స్థానాలు మెరుగుపడ్డారు. పాటిన్సన్ 31, యాదవ్ 42 స్థానాల్లో నిలిచారు