'జబర్దస్త్' రేష్మి, ఆనంద్‌బాబు జంటగా డి.దివాకర్ దర్శకత్వంలో బాలాజీ
నాగలింగం సమర్పణలో వి సినీ స్టూడియోస్ పతాకంపై వి.లీన నిర్మిస్తున్న చిత్ర
ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు
బి.గోపాల్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వడంతోపాటు గౌరవ దర్శకత్వం
వహించారు. కెమెరామెన్ జి.ప్రభాకర్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఈ
సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ఇదొక డిఫరెంట్ హర్రర్ కామెడీ చిత్రం.
ఆద్యంతం సస్పెన్స్‌గా సాగుతుంది. ఇందులో ఉండే ఒక ట్విస్ట్ చాలా
థ్రిల్లింగ్‌గా ఉంటుంది. 'అనగనగా ఒక చిత్రమ్' దర్శకుడు జి.ప్రభాకర్‌రెడ్డి
ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్
షూటింగ్ బుధవారం నుంచి ప్రారంభించి జనవరిలో పూర్తి చేయనున్నాం' అని
అన్నారు. 'దర్శకుడు దివాకర్ ఏడాదిన్నరగా ఈ చిత్ర కథపై వర్కౌట్ చేశారు.
ఫైనల్‌గా మంచి స్క్రిప్టు వచ్చింది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను
ఎంటర్‌టైన్ చేస్తుంది' అని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రేష్మి మాట్లాడుతూ,
'వైజాగ్‌కు చెందిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చేస్తున్న చిత్రమిది. ఇందులో
నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని తెలిపారు.
'హర్రర్ కామెడీగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని
ఆశిస్తున్నాం' అని నిర్మాత లీన తెలిపారు. వైజాగ్ ప్రసాద్, పూర్ణిమ, కాశీ
విశ్వనాథ్, సప్తగిరి
ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఇతర పాత్రలు పోషిస్తున్నారు.