నేను తీసుకునే నిర్ణయాలు సరైనవని నేనెప్పుడూ అనుకోనంటోంది రాశీ ఖన్నా. నాలో నేను చూడని నటిని నా దర్శకులు చూస్తారు, అందుకే దర్శకుల నమ్మకాన్ని బట్టి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటానని చెబుతోంది. తెలుగు చిత్రసీమలో జోరు మీదున్న కథానాయికల్లో రాశి ఒకరు. ప్రస్తుతం రామ్‌తో ‘హైపర్’, గోపీచంద్‌తో ‘ఆక్సిజన్’లో నటిస్తోంది. కెరీర్ పరంగా మీ ప్రణాళికలు ఎలా ఉంటాయని అడిగితే ‘‘చిత్రసీమలో మనం అనుకున్నట్లు ఏదీ జరగదు. పరిస్థితుల్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోను. నేను సినిమా రంగానికొచ్చి ఏళ్లు గడుస్తున్నా నాలో సిగ్గు మాత్రం పోలేదు. తెరపై కొన్ని పాత్రలు చూస్తున్నప్పుడు ఇలాంటిది నేను చేయగలనా? అనుకుంటుంటా. దర్శకులు నా పాత్ర గురించి చెబుతున్నప్పుడూ అలాగే అనిపిస్తుంది. వాళ్లు నన్ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రని సృష్టించారంటే నేను చేయగలననేగా అర్థం. అందుకే నాలో ఓ పాత్రపై సందేహాలున్నప్పటికీ దర్శకులిచ్చే ధైర్యంతో పచ్చ జెండా వూపేస్తుంటా. అలా చేసిన ప్రతిసారి నాకు మంచి ఫలితాలే లభిస్తుంటాయ’’ని చెప్పింది రాశీ ఖన్నా.
Monday, September 5, 2016
ఇంకా సిగ్గు పోలేదు

Subscribe to:
Posts (Atom)