నాకెవరూ పోటీ కాదు అంటున్నారు యువ నటి కీర్తీసురేశ్. తల్లి మేనక
వారసురాలిగా తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ ఆదిలోనే అనూహ్య విజయాలను అందుకుని
విజయపథంలో కొనసాగుతున్నారు. కోలీవుడ్‌లో ఇప్పటికి ఈమె నటించిన చిత్రాలు
విడుదలైనవి రెండే రెండు చిత్రాలు. అందులో ఒకటి ఓకే అనిపించుకున్నా, రెండోది
ఘన విజయం సాధించింది. దీంతో కీర్తీసురేశ్ రేంజ్ కోలీవుడ్‌లో ఒక్కసారిగా
పెరిగిపోయింది. నీ నవ్వే చాలు చామంతీ అన్నట్లు కీర్తీసురేశ్ నవ్వే పెద్ద
వశీకరణం అని సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. రాబోయే చిత్రాలు ఈ
సుందరి పేరును మరింత ఇననుమడింపజేస్తాయనే నమ్మకంతో ఉన్నారీమె. కారణం
ప్రస్తుతం తను నటిస్తున్న చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. వాటి గురించి
కీర్తీసురేశ్ తెలుపుతూ తాను ధనుష్‌కు జంటగా నటించిన తొడరి, బాబీసింహా
నటించిన పాంబుసండై చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయన్నారు.
ప్రస్తుతం భరతన్ దర్శకత్వంలో విజయ్‌కు జంటగా నటిస్తున్న చిత్రం, శివకార్తికేయన్ సరసన నటిస్తున్న రెమో చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయని చెప్పారు. తొడరి చిత్రంలో తనది చాలా ముఖ్యమైన పాత్ర అన్నారు. ఈ పాత్రకు అవార్డు వస్తుందని అంటున్నారని, అలా వస్తే సంతోషమేనని అన్నారు. ప్రస్తుతానికి మలయాళం, కన్నడం చిత్రాల్లో నటించడం లేదని చెప్పారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయని అయితే అధిక చిత్రాల్లో నటించాలనే ఉద్దేశమేమీ తనకు లేదని పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉన్న మంచి బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ఇకపోతే తాను ఇతర హీరోయిన్లను పోటీగా భావించడం లేదన్నారు. తన ముందు చిత్రాల్లో పాత్రలనే పోటీగా తీసుకుని నటిస్తానని నటి కీర్తీసురేశ్ తెలిపారు.