‘ముకుంద’ చిత్రంలో అబ్బాయ్ వరుణ్‌తేజ్‌తో జతకట్టిన గోపికమ్మ పూజా హెగ్డే
తాజాగా బాబాయ్ పవన్ కల్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందని
ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసినీ
క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఓ చిత్రం నిర్మించనున్న
విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు పవన్‌తో జతకట్టనున్నారు.
ఇప్పటికే కీర్తి సురేశ్ ఓ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. మరో కథానాయికగా పూజా
హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారట.
ఆ సంగతలా ఉంచితే ‘ముకుంద’ తర్వాత హిందీలో ‘మొహెంజోదారో’ చేసిన పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘డీజే’(దువ్వాడ జగన్నాథమ్) చిత్రంలో నటిస్తోంది. ఇకపై తెలుగు సినిమాలపై ఆమె ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నారట.