రవితేజ కథానాయకుడి హరీష్ శంకర్ యస్. దర్శకుడిగా ఎల్లో ప్లవర్స్ పతాకంపై రమేష్ పుష్పాల నిర్మిస్తున్న ' మిరపకారు ' సినిమా సస్సెస్‌మీట్ తాజ్‌దక్కన్ హోటల్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో రమేష్‌పుప్పాల, రవితేజ, ఆలీ, బ్రహ్మాజీ, రిచా గంగోపాద్యాయ, సునిల్, స్నిద్గ, దీక్షాసేత్, దువ్వాసి మోహన్, తమన్, సాహితి, రామ్ ప్రసాద్, గౌతమ్‌రాజ్, హరీష్ శంకర్, ఫిష్ వెంకట్, గిరి, భాస్కర్ తదితరులు హజరయ్యారు.
రవితేజ మాట్లాడుతూ ..
ఈ విజయం చాలా ఆనందాన్ని ఇ చ్చింది. దర్శకుడు నిర్మాతకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు, సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు, స్నిగ్ద వాయిస్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అన్నారు.
సునిల్ మాట్లాడుతూ ..
ఆంధ్రా అంతా మిరపకాయ్ తోటలాగా పాకి పోయింది. సినిమా చూసి ఒక ఆడియన్‌గా చాలా ఆనందించాను. సూపర్‌హిటÊ అవుతుందని చెప్పాను. రొటీన్ కమర్షియల్ సినిమా అని క్రిటిక్స్ అన్నారు. అయితే రవితేజ గారి ప్రయోగాత్మక సినిమాలు చేశారు. అయితే అవి ఆశించినంతగా ఆడలేదు. అయితే ఇ ది శాంపిల్ మాత్రమే. ముందు అసలు సినిమా చూస్తారు.
ఆలీ మాట్లాడుతూ..
ఈ బేనర్ పెట్టడంతోటే సక్సెస్ స్టార్ట్ అయింది. ఈ బేనర్ పేరు అలాంటిది. భవిష్యత్‌లో తీసిన సినిమాలు తప్పకుండా విజయవంతం సాధిస్తాయి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రవితేజ హైఓల్టేజ్‌లో పని చేశారు. హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. 'మిరపకాయ్' ఘాటుగా తీశారు. సంక్రాంతిలో సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు అన్నారు.
దీక్షా సేత్ మాట్లాడుతూ ..
ఈ సినిమా దర్శకుడి సత్తా ఏమిటో తెలిసింది. ఈ సినిమా చేయడం ఒక కొత్త అనుభూతి ఈ సినిమా మంచి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.
రిచా మాట్లాడుతూ ..
సినిమా విజయవంతం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆవకాశం ఇ చ్చిన నిర్మాత దర్శకులకునా కృతజ్ఞతలు అన్నారు.
స్నిగ్థ మాట్లాడుతూ ..
ఇ ది నా తొలిసినమా ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులను నా కృతజ్ఞతులు అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ..
ఈ సక్సెస్‌ను ఎంజారు చేస్తున్నారు. దర్శకుడు అంటే రవికి నమ్మకం ఆ నమ్మకంతోనే ఈ సినిమా ఇ చ్చాడు. నా కెరియర్‌లోనే నా గురించి ఓ మంచి కేరక్టర్ రాశాడు దర్శకుడు అన్నారు.
రాంప్రసాద్ మాట్లాడుతూ ..
సినిమా చేయడం చాలా అనందంగా ఉంది. సినిమా తప్పకుండా ఆడుతుందనే నమ్మకం ముందునుండి కలిగింది. దర్శకుడు హరీష్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
తమన్ మాట్లాడుతూ ..
ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞలు తెలపుకుంటున్నాను అన్నయ్య రవితేజకు. హరీష్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. అతను ఎంతో కష్టపడ్డాడు. సినిమా విజయవంతం అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
రమేష్ పుప్పాల మాట్లాడుతూ ..
చాలా అనందంగా ఉంది. ఈ సినిమా విజయం వెనక కృషి చేసిన సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా ఘాటింగ్‌కు వచ్చినపుడు ఎవరికి వారు ఈ సినిమా నాది అన్నట్లుగా పని చేసుకుంటూ ఉండేవారు. నా నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ నిజం చేశారు. ఈ సినిమ విజయం గురించి వింటుంటే చాలా అనందంగా ఉంది అన్నారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ ..
ఈ సినిమా విజయవంతం అయిదంటే ఆ క్రెడిట్ రవితేజ గారిదే. నా మీద నాకున్న కంటే రవితేజకు నామీద ఎక్కవ దాంతో నేను అప్పుడప్పుడూ టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో టెన్షన్ పడవద్దు ఈ సినిమా కాకపోతే మరో సినిమా చేద్దాము అని ధైర్యం ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంచాడు. సినిమా ఇ చ్చాడు. ఈ సినిమాకు టైటిలÊ పెట్టింది రవితేజ కథ విని ఈ టైటిల్‌ను పెట్టాడు. మేము ఏది చేసినా మాకు నమ్మకం ఇచ్చింది రవితేజనే. అతను లేకపోతే సినిమానే లేదు. స్నిగ్ధ వాయిస్ నచ్చి ఆమెను ఈ సినిమా ద్వారా పరిచయం చేశాము. అలాగే సినిమాకు పని చేసిన వారందరకీ పేరు పేరున కృతజ్ఞతలు తెలపుకుంటున్నాను అన్నారు.