కొందరికి
మోడ్రన్ డ్రెస్సుల్లో లుక్ అదిరిపోతుంది. మరికొందరికి చీరల్లో సింగారం
రెట్టింపవుతుంది. ఇంకొందరికేమో సాదాసీదాగా కనిపించినా అందం ఇనుమడిస్తుంది. ఈ
మూడు రూపాల్లోనూ అందంగా కనిపించే భామలూ ఉన్నారు. టాలీవుడ్‌లో ఉన్న అరడజను
ముద్దుగుమ్మల్ని పరిశీలిస్తే ఏ డ్రెస్సు వేసినా ఆ డ్రెస్సుకే కేరాఫ్
అడ్రస్ అనిపించే ముద్దుగుమ్మ కాజల్. అందుకే ఈ అమ్మడు ఎక్కువగా సాదాసీదా
దుస్తుల్లోనే కనిపించడానికి ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో
ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. లవ్ ఫెయిల్యూర్ ఫేం
బాలాజీ మోహన్ ఈ చిత్రానికి దర్శకƒత్వం వహిస్తున్నారు. చెన్నయ్‌లో శరవేగంగా
షూటింగ్ జరుగుతోందిప్పుడు. ఆన్‌సెట్‌స ఈ అమ్మడు ధరించిన ఓ కాస్టూ్యమ్‌ని
ఆన్‌లైన్‌లో రివీల్ చేసింది. ఈ లుక్ చాలా బావుందని ప్రశంసలొస్తున్నాయి.
కాజల్ వల్ల ఆ డ్రెస్సుకి అందం వచ్చిందా? డ్రెస్సు వల్ల కాజూకి అందం
వచ్చిందా? అంటూ ఆన్‌లైన్‌లో అంతా పోటీ పెట్టుకున్నారు. ఈ తమిళ సినిమాతో
పాటు పూరి, ఎన్టీఆర్ సినిమా కూడా ఆన్‌సెట్‌స ఉంది. కాజల్ రెండు చోట్లా
బిజీగా ఉంది.