సీనియర్ నటుడు చంద్రమోహన్
అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం గుండెపోటురావడంతో కుటుంబ సభ్యులు
ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి
నిలకడగానే వుందని వైద్యులు ప్రకటించారు. చంద్రమోహన్ కోలుకుంటున్నారని, ఆయన
ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని చంద్రమోహన్ మేనల్లుడు కృష్ణప్రసాద్
తెలిపారు. రెండురోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామన్నారని ఆయన
చెప్పారు.