ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్
లీగ్(ఐపీఎల్)లో తాను పాల్గొనాలని అనుకోవడం లేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు
కెవిన్ పీటర్సన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన క్రికెట్ షెడ్యూల్ బిజీగా
ఉండటంతో, ఐపీఎల్ కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు. గతేడాది రైజింగ్
పుణె సూపర్ జెయింట్స్ తరపున ఆడిన పీటర్సన్.. ఆ ఏడాది నాలుగు మ్యాచ్ లు ఆడిన
తరువాత గాయం కారణంగా దూరమయ్యాడు.
అయితే గత డిసెంబర్ లో పీటర్సన్ ను పుణె సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. ఈ
నేపథ్యంలోనే ఐపీఎల్లో ఆడాలంటే ఫిబ్రవరి నెలాఖరున జరిగే వేలంలో ఏదొక
ప్రాంఛైజీ పీటర్సన్ ను కొనుగోలు చేయాల్సి ఉంది. కాగా, తాను ఐపీఎల్ కు
సిద్ధంగా లేనని పీటర్సన్ ముందుగానే ఓ ప్రకటన విడుదల చేశాడు.
'ఐపీఎల్ వేలానికి నేను రావాలని అనుకోవడం లేదు. ఈ శీతాకాలపు సీజన్ లో అనేక మ్యాచ్ లతో బిజీగా ఉన్నా. ఒకవైపు ప్రయాణాలు, మరొకవైపు మ్యాచ్ లతో తీరిక లేకుండా ఉన్నా. దాంతో వచ్చే వేసవిలో ప్రయాణాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటా' అని పీటర్సన్ తెలిపాడు.