Thursday, November 4, 2010
పరుగుల విందు
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన బ్యాట్ పదునును న్యూజిలాండ్ బౌలర్లకు మరోసారి రుచి చూపించాడు. వరుస వైఫల్యాలతో నిరుత్సాహపరుస్తున్న రాహుల్ ద్రావిడ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి మొటేరా మైదానంలో తన సత్తాను మరోసారి చాటుకున్నాడు. వీరిద్దరూ విజృంభించి ఆడి సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్‌తో గురువారం నాడిక్కడ ప్రారంభమైన తొలి క్రికెట్ టెస్టులో భారత్ మొదటి రోజు మూడు వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. వన్డే మ్యాచ్ తరహాలో బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్ 173 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా ద్రావిడ్104 పరుగులకు అవుటయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 237 పరుగులు జోడించి రికార్డు నెల కొల్పారు. వరుసగా తొమ్మిది టెస్టుల్లో టాస్ కోల్పో యిన ధోనీ ఈ టెస్టులో టాస్ గెలవడం తరువాయి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లకు భారంగా పరిణ మించిన పిచ్‌పై భారత్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు.
తొలి వికెట్‌కు గంభీర్, సెహ్వాగ్ 12 ఓవర్లలోనే 60 పరుగులు చేసి శుభారంభం అందించారు. గంభీర్ అవుటైన తరువాత వచ్చిన ద్రావిడ్ ఆరంభంలో కొంత నిదానంగా ఆడినప్పటికీ తరువాత పుంజు కున్నాడు.సెహ్వాగ్‌తో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. సునీల్ గవాస్కర్, సురీందర్ అమర్‌నాథ్ 1976లో ఆక్లండ్‌లో 204 పరుగులు చేసి నెలకొల్పిన రికార్డును సెహ్వాగ్, ద్రావిడ్ జోడీ చెరిపేసింది. మొదటి రోజు ఆట టీ విరామం తరువాత భారత్ ఈ రెండు వికెట్లను కోల్పోయింది.సెహ్వాగ్‌కు టెస్టుల్లో ఇది 22వ సెంచరీ కాగా ద్రావిడ్‌కు 30వది.
Subscribe to:
Posts (Atom)