సునీల్ హీరోగా నటించిన 'ఫూలరంగడు' శనివారంతో 50 రోజు లకు చేరుకుటుంది. ఈ సందర్భం గా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లా డుతూ... మా ఆర్‌ఆర్‌మూవీ మేకర్స్ బేనర్‌లో సంక్రాంతికి బిజినెస్‌మేన్ సూపర్ హిట్‌కాగా, మహాశివ రాత్రికి వచ్చిన పూలరంగడు సూపర్ హిట్ అయింది. ఏప్రిల్ 7కు 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్ర విజయానికి సిక్స్‌ప్యాక్, అనప్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యాయి. ప్రేమకావాలి తర్వాత మా బేనర్‌లో పూలరంగడు మరో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియ జేశారు.