టీమ్‌ఇండియా
పేసర్ ఇషాంత్‌శర్మ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమసింగ్‌ను డిసెంబర్
9న పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 19న ఈ జోడీకి నిశ్చితార్థం జరిగింది. వారణాసికి
చెందిన ప్రతిమ.. పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు ఆసియాకప్‌లోనూ భారత
బాస్కెట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ‘సింగ్ సిస్టర్స్’గా పేరు
సంపాదించిన ఐదుగురు అక్కాచెల్లెళ్లలో ప్రతిమ చిన్నది. ఆమె అక్కలందరూ
జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారిణులే.