అంతర్జాతీయ క్రికెట్‌కు హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఉప్పల్‌లోని హెచ్‌సీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనందుకు అదృష్టంగా భావిస్తున్నానన్నారు. క్రికెట్ ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. 16 ఏళ్లపాటు క్రికెట్‌కు సేవలందించినందుకు గర్వకారణంగా ఉందన్నారు. 134 టెస్టుల్లో 8781 పరుగులు, 17 శతకాలు, 56 అర్ధ సెంచరీలు, 86 వన్డేల్లో 2338 పరుగులు, 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేశాడు. ఆసీస్‌పై ఈనెన్ గార్డెన్స్‌లో అత్యధిక స్కోర్ 281 పరుగులు చేశాడు. 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. యువతకు అవకాశం కల్పించేందుకే రిటైర్మెంట్ అవుతున్నానని చెప్పారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉపాధ్యాయులు, మిత్రుల ప్రోత్సాహంతోనే ఇంతటి వాడినయ్యానని అన్నారు. డర్బన్‌లో దక్షిణాఫ్రికాపై విజయం మరవలేనిదని గుర్తుచేశారు. తన ప్రతిభను గుర్తించిన హెచ్‌సీఏకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.