Saturday, February 5, 2011
మాస్ కథతో ప్రభాస్ - అనుష్క ' రెబల్ '
ప్రబాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జై భగవన్, జై పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ' రెబల్ ' చిత్రం రెగ్యులర్ ఘాటింగ్ ఈ నెల మూడో వారం నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది. నిర్మితాలు మాట్లాడుతూ లారెన్స్ చెప్పిన కథ ప్రభాస్‌కి ఎంతగానో నచ్చింది. యాక్షన్ , వినోదంతో పాటు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాల్నీ మేళవించాం. అనుష్క కథానాయిక ' బిల్లా ' తరువాత ప్రభాస్ - అనుష్క జోడీ కట్టిన చిత్రం ఇదే.
పాపం .. దాదా
ఐపీఎల్‌లో ఆడాలని ఆశించిన భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ చివరికి నిరాశ మిగిలిది. ఈ టోర్నిలో దాదా బ్యాటింగ్‌ను చూసే అవకాశం దాదాపుగా లేదు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుబోని ఆటగాళ్లను తీసుకోరాదని మూడు ఫ్రాంచైజీలు అభ్యంతర వ్యక్తం చేయడంతో గంగూలీకి అవకాశం లేకపోయింది. కొత్త ప్రాంచైజీ కొచ్చి.... గంగూలీని అతని ప్రాథమిక ధర 1.8 కోట్ల రూపాయలు చెల్లించి జట్టులోకి తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు బీసీసీకి లేఖ రాసింది. దీంతో ఈ విషయంలో తమ అభిప్రాయల్ని తెలియజేయాల్సిందిగా ఇతర ప్రాంచైజీలను బీసీసీఐ కోరింది. అయితే ఇతర ప్రాంచైజీల నుంచి అభ్యతరాలు రావడంతో వారిని తీసుకోరాదని పాలకమండలి సమావేశంలో నిర్ణయించింది.
పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా : వీరు
గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచకప్‌కు సిద్దమంటూ ప్రకటించాడు.భుజం నొప్పితో ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన ఐదు వన్డేలలో అదుబాటులో వీరు తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాయం నుంచి వేగంగా కోలుకుటున్నట్లు తెలిపాడు. ' దక్షిణాఫ్రికా ' పర్యటనలో కొద్దిగా భుజం నొప్పి ఉండడంతో వన్డే సిరీస్‌కు తప్పుకున్నాను. ఎందుకంటే అక్కడ గాయాని తీవ్రం చేసుకుని ప్రపంచకుదూరం కావాలిని కోరుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి ఫిట్‌నెస్‌ను పరీక్షించుకుంటాను అని ఇంటర్వ్యూలో వీరూ పేర్కొన్నారు.
Subscribe to:
Posts (Atom)