సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత దంపతులు శుక్రవారం ఉదయం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు దంపతులకు విష్ చేశారు. అంతే కాదు ఈ సందర్భంగా ఆయన మహేష్ ఇంట పుట్టిన లిటిల్ ఏంజల్ కోసం ఓ పేరు కూడా సూచించారు.
ఆయన సూచించిన పేరు ాసితారః. మరి ఈ పేరుపై పాపాయిని రాజమౌళి ముద్దుగా పిలుచుకుంటున్నారా...? లేక మహేష్ బాబు మనసులో ఉన్న ఆలోచనను ఈ విధంగా బయట పెట్టారా? అనేది తేలాల్సి ఉంది. మహేష్ బాబుకు చాలా దగ్గరి స్నేహితుల్లో రాజమౌళి ఒకరు. తరచూ ఆయన్ను ఈయన..ఈయన్ను ఆయన పొగుడుకుంటుండం మనం చూస్తూనే ఉన్నాం. ఆచొరవతోనే రాజమౌళి మహేష్ కూతురికి పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక మహేష్ బాబు పాపాయి విషయానికొస్తే... నమ్రత ప్రసవించిన స్వప్న నర్సింగ్ హోం డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, కాన్పు జరిగే సమయంలో మహేష్ భార్య పక్కనే ఉన్నాడని చెప్పారు. మహేష్ బాబు బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి ముందుగానే చేరుకున్నారని, మహేష్ బాబు తనయుడు గౌతం కూడా ఉదయం నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారని, తన చిట్టి చెల్లి చూసి మురిసి పోయాడని వెల్లడించారు.