సాయిరామ్‌శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం నేనోరకం శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రేష్మీమీనన్ కథానాయిక. సుదర్శన్ సలేంద్ర దర్శకుడు. శ్రీకాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మహిత్ నారాయణ్ సంగీత దర్శకత్వంలో అంబట్ల రవి రచించిన చూడకుండా ఉండలేనే ఒక్క క్షణమైనా.. అనే పల్లవితో రూపొందిన ఈ చిత్ర సాంగ్ టీజర్‌ను దేవిశ్రీప్రసాద్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనోరకం టీజర్, సాంగ్స్ ఎంటర్‌టైనింగ్‌గా వున్నాయి. సాయిరామ్‌శంకర్ కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. మహిత్‌నారాయణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది అన్నారు.
సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ సమకాలీన అంశాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నా గత చిత్రాలకు భిన్నంగా వుండే చిత్రమిది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ టైటిల్‌కు తగ్గట్లుగానే సరికొత్త ట్రీట్‌మెంట్‌తో రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకముంది అన్నారు. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రాధిక శరత్‌కుమార్ ఆసక్తిచూపిస్తున్నారు అని నిర్మాత తెలిపారు.