అందాల శృతిహాసన్ ఓ అరుదైన అవకాశం అందుకుంది. తండ్రి కమల్‌హాసన్ సరసన నటించిన సీనియర్ నాయిక శ్రీదేవితో కలిసి నటించే గొప్ప ఛాన్‌స కొట్టేసింది. ఈ అమ్మడు విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో విజయ్ సరసన ప్రధాన నాయికగా హన్సిక నటిస్తోంది.హనీకి తల్లి పాత్రలో శ్రీదేవి కనిపిస్తోంది. ఈ సినిమాలో శృతి కూడా ఓ కీలకపాత్రలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్‌స. శ్రీదేవితో కలిసి ఒకే ఫ్రేములో మాత్రం కనిపించే ఛాన్సుందని సమాచారం. అతిలోక సుందరి శ్రీదేవి ఇప్పటికే సినిమాలు వదిలేసి 26 సంవత్సరాలైంది. రీఎంట్రీ సినిమా ఇంగ్లీష్ వింగ్లీష్ తర్వాత ఇప్పుడిలా ఓ పూర్తి స్థాయి క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఇదే తరుణంలో శ్రీదేవితో కలిసి నటించే అవకాశం శృతిని వరించింది. ఇది నిజంగానే అమ్మడికి ఓ మధుర క్షణం. ఇలాంటి క్షణాల్ని ఆస్వాధించే అదృష్టం, అవకాశం వేరెవరికీ రానేరావు. ఇటీవలే విజయ్-హన్సిక జంటపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఇటీవలే శృతితో సన్నివేశాల చిత్రీకరణకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం అమ్మడు ఆన్‌సెట్‌స ఉంది. ఇదో చక్కని ఫాంటసీ చిత్రం. కాబట్టి శృతి యాంజెల్‌లా కనిపిస్తుందేమో చూడాలి.
Sunday, November 23, 2014
ఇదో గొప్ప ఛాన్స్

నాకు నేనే పోటీ!
సినీ పరిశ్రమలో నాకు ఎవరూ పోటీకాదు. మరొకరితో పోటీపడి నటించడం నాకు ఇష్టం ఉండదు అని చెబుతోంది బాలీవుడ్ సొగసరి కత్రినాకైఫ్. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అవుతోంది ఈ సుందరి. కమర్షియల్ సినిమాలతో పాటు ఆడపాదడపా ప్రత్యేక గీతాల్లో సత్తా చాటుతోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆమె ఇతర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది.
అయితే కత్రినా కైఫ్ మాత్రం నాకు ఎవరూ పోటీకాదని చెబుతోంది. ఆమె మాట్లాడుతూ పోటీ అనేది మరోకరి ఎదుగుదలను అడ్డుకునే విధంగా ఉండకూడదని నా అభిప్రాయం. మంచి చేయకపోయినా... కానీ చెడు చేయకూడదన్నదే నా సిద్దాంతం. ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనలతో వచ్చేవారిని ప్రోత్సహించను. అయినా సినిమాల పరంగా నేను ఎవరికీ పోటీకాదు. నాకు నేనే పోటీ.నా దృష్టిలో కాంపిటిషన్ అనేది నెగెటివ్ అంశమేమికాదు. పోటీ ఉంటేనే మనలోని తప్పుల్ని సరిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుంది. కెరీర్‌ను మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. నా మటుకు నేను ఇతర హీరోయిన్లు నటించిన సినిమాలు చూసే స్ఫూర్తి పొందుతాను. అలా ఉండటమే మంచిది అని చెబుతోంది. ప్రస్తుతం కత్రినాకైఫ్ ఫాంటమ్ జగ్గాజాసూస్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.
Subscribe to:
Posts (Atom)