ఇండియన్ ప్రీమియర్ లీగ్
(ఐపీఎల్)లో వచ్చే రెండేండ్లకు నూతనంగా రెండు జట్లు రానున్నాయి. రెండేండ్ల
నిషేధం ఎదుర్కొంటున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్
ప్రాంఛైజీల స్థానంలో 2016, 2017 సీజన్‌లలో ఈ రెండు జట్లు పాల్గొంటాయి.
డిసెంబర్ 8న సమావేశం కానున్న ఐపీఎల్ పాలకమండలి భేటీ అనంతరం రెండు కొత్త
జట్లపై ప్రకటన చేయనుంది. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, కార్యదర్శి
అనురాగ్ ఠాకూర్, రాజీవ్ శుక్లా సమావేశంలో పాల్గొననున్నారు. చెన్నైకి
చెందిన చెట్టనాడ్ సంస్థ ఓ జట్టును సొంతం చేసుకోనుందని సమాచారం. సూపర్
కింగ్స్ ఇండియా సిమెంట్ యాజమాన్యానిది కాగా.. చెట్టినాడ్ గ్రూప్‌కు సైతం
సిమెంట్ వ్యాపారం ఉన్న విషయం తెలిసిందే. గోయంకా బ్రదర్స్.. హర్ష్,
సంజీవ్‌లు సైతం ఐపీఎల్ జట్టుపై ఆసక్తిగా ఉన్నారు. మొబైల్స్ కంపెనీ
వీడియోకాన్ కూడా బీసీసీఐ నుంచి ఇన్విటేషన్ టూ టెండర్ ఫామ్‌ను
తీసుకున్నట్టు సమాచారం. మంగళవారం ఐపీఎల్ పాలకమండలి భేటీ తర్వాత జరిగే
మీడియా సమావేశంలో బోర్డు పెద్దలతో పాటు కొత్తగా చేరిన రెండు జట్ల యజమానులూ
పాల్గొననున్నారు.
Sunday, December 6, 2015
షాపింగ్‌కి వెళితే అవి కొనకుండా ఉండలేను!
శ్రుతీహాసన్ ఫిజిక్ చాలా బాగుంటుంది. మోడ్రన్ దుస్తుల్లోనూ బాగుంటారు..
సంప్రదాయ దుస్తుల్లోనూ లవ్లీగా ఉంటారు. ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న
మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అందుకు అనుగుణంగా డ్రెస్సులు సెలక్ట్
చేసుకుంటారామె. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ - ‘‘నాకు తెలిసి
బట్టలు, నగలు ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. నగల సంగతెలా ఉన్నా డ్రెస్సులంటే
నాకు పిచ్చి. షాపింగ్ మాల్‌లోకి అడుగుపెట్టానంటే బట్టలు కొనకుండా ఉండలేను.
జనరల్‌గా నాకు జీన్స్, టీ-షర్ట్ ఇష్టం. అవే సౌకర్యవంతంగా అనిపిస్తాయి.
అయినప్పటికీ వేరే డ్రెస్సులు కూడా కొంటుంటాను. బట్టల పిచ్చి మాత్రమే కాదు..
నాకు పాదరక్షల పిచ్చి కూడా ఉంది. షాపింగ్‌కి వెళ్లినప్పుడు షూస్ కొనకుండా
ఉండలేను.
ఇప్పటివరకూ నా దగ్గర యాభై, అరవై షూస్ ఉన్నాయి. అన్నేం చేసుకుంటావని
ఫ్రెండ్స్ అడుగుతుంటారు. నవ్వేసి ఊరుకుంటాను. సీజన్‌కి తగ్గట్టుగా,
వేసుకున్న డ్రెస్‌కి మ్యాచింగ్‌గా షూలు వేసుకుంటాను’’ అని చెప్పారు.
అదృష్టం అంటే నాదే..
జట్టులో చోటు కోల్పోయిన సమయంలో రంజీల్లో ఆడటం తనకు చాలా కలిసి వచ్చిందని
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. జట్టులో చోటు కోల్పోయిన
అనంతరం సౌరాష్ట్ర తరఫున జడేజా రంజీల్లో అద్భుతంగా రాణించాడు. రంజీల్లో
బౌలింగ్ చేసిన మాదిరిగానే సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్‌లోనూ
చేస్తున్నాను పునరాగమనంలో నా బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను.
అశ్విన్, అమిత్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడం నా అదృష్టం. నాపై ఎలాంటి
ఒత్తిడి లేకుండా పోయింది. అందుకే వికెట్లు తీస్తున్నాను అని జడేజా ఆనందం
వ్యక్తం చేశాడు.
Subscribe to:
Posts (Atom)