పురుషుల కన్నా స్త్రీల ఆయు:
ప్రమాణం ఎక్కువని చాలా పరిశోధనల్లో తేలింది. పురుషులతో పోలిస్తే గుండె
జబ్బులు, పక్షవాతం..లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా స్త్రీలలో తక్కువగా
రావడాన్ని గమనించారు. రోగనిరోధకశక్తితో పాటు జీవనపరిమితి కూడా స్త్రీలలో
ఎక్కువగా ఉండడానికి కారణమేమిటి? అనే విషయంపై జీవశాస్త్రవేత్తలు కొన్ని
దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఈ విషయం అంతుచిక్కని రహస్యంగానే
ఉంది. కానీ స్కాండినేషియన్ శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనల్లో ఒక కొత్త
విషయాన్ని చెప్పారు. స్త్రీ శరీర కణాల్లో వైవిధ్యభరితమైన రెండు ఎక్స్
క్రోమోజోములు ఉండడమే ఇందుకు కారణమని ఆ నిపుణుల బృందం పేర్కొంది.
ఆ రెండే కీలకం : మనిషి శరీరం సూక్ష్మమైన కణాలతో నిర్మితమైందన్న సంగతి తెలిసిందే. ప్రతి కణంలోనూ 22 జతల నిర్మాణాత్మక క్రోమోజోములు, ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. వీటిలో సగం తల్లి, సగం తండ్రి నుంచి సంక్రమిస్తాయి. అయితే వీటిలో శరీర నిర్మాణానికి దోహదపడే 22 జతల క్రోమోజోముల సంగతలా ఉంచితే, తల్లిదండ్రులిద్దరి నుంచి ఆనువంశికంగా వచ్చే లైంగిక క్రోమోజోములే జీవి లింగభేదాన్ని నిర్దేశిస్తాయి. కీలకమైన ఆ క్రోమోజోముల్నే ఎక్స్, వై గా పిలుస్తారు. ఇవి స్త్రీలలో ఎక్స్, ఎక్స్ సంయోగంగా, పురుషుల్లో ఎక్స్, వై సంయోగంగా ఉంటాయి. ఫలదీకరణ సమయంలో ఈ క్రోమోజోముల్లో జరిగే కణవిభజన, పుట్టేబిడ్డ ఆడా, మగా అనే విషయాన్ని నిర్దేశిస్తుంది. ఆయా క్రోమోజోముల మీద ఉన్న జన్యువులే కణవిభజనను ప్రభావితం చేస్తాయి. అయితే తల్లి, తండ్రి నుంచి వచ్చే వైవిధ్యభరితమైన ఆ రెండు ఎక్స్ క్రోమోజోములే స్త్రీలలో ఆయు:ప్రమాణం ఎక్కువగా ఉండడానికి కారణమని స్కాండినేషియన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు ఎక్స్ క్రోమోజోముల కారణంగా ప్రతి స్త్రీ శరీరంలోనూ స్వల్ప వైవిధ్యం ఉన్న రెండు కణరేఖలు ఏర్పడతాయి. ఈ కణరేఖలే జీవి ఆయు:ప్రమాణాన్ని పెంచడానికీ, తగ్గించడానికీ దోహదపడతాయని వారు వివరించారు. స్త్రీలలో రెండు రకాల కణరేఖలు ఏర్పడడం వల్ల జీవనాన్ని ప్రభావితం చేయగల రేఖను ఎంపిక చేసుకునే అవకాశం వాళ్ల శరీరానికి ఉంది. అలాంటి అవకాశం పురుషులకు లేదు. అందుకే పురుషులలో కన్నా స్త్రీలలో ఆయు:ప్రమాణం ఎక్కువ అని తమ ప్రయోగాల ద్వారా వారు పేర్కొన్నారు.
స్త్రీలలో ఉండే ఈ రెండు కణరేఖల్లో ఎదో ఒకటి మాత్రమే పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందని డెన్మార్క్‌లోని ఓడెన్స్ యూనివర్సిటీకి చెందిన కారీ క్రిస్టెన్‌సెన్, ఓస్లోలోని ఉలెవల్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన కరెన్ హెలెన్ ఆర్‌స్టావిక్ అధ్యక్షతన పరిశోధనలు చేసిన బృందం పేర్కొంది. ఎక్స్ క్రోమోజోమ్ మీదున్న ఆండ్రోజన్ జన్యుకారకం ఆధారంగా ఆ రెండూ ఒకదానిలో ఒకటి కలియకుండా విడవిడిగా ఏర్పడినవేనని తేలింది.
ఈ పరిశోధనల కోసం వయస్సు తక్కువగా ఉన్న మహిళల కణాలను పరిశీలించారు. అందులో ఆ రెండు రేఖలు సుమారుగా 50:50 నిష్పత్తిలో విభజన చెంది ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత వృద్ధుల శరీరంలోని కణరేఖల్ని పరిశీలించారు. వారందరిలో కూడా ఒకే కణరేఖకే ప్రాముఖ్యం ఇచ్చినట్లు కనుగొన్నారు. ఆ తర్వాత నడివయస్సు ఉన్న మహిళలో పరిశోధనలు చేశారు. మొత్తం అందరిలోనూ రెండు కణరేఖల్లో ఒకటి పూర్తిగా చర్యాగుణాన్ని అంటే డామినేట్ చేస్తూ కనిపించింది. అదే పురుషుల్లో అయితే ఒకే ఒక కణరేఖ ఉంటుంది. కాబట్టి వారికి ఒకే అవకాశం ఉంటుందని క్రిస్టెన్‌సెన్ పేర్కొన్నారు. అంతేకాదు, స్త్రీలలో రెండు కణరేఖలు ఉండడం వల్ల ఒకటి కాకపోతే రెండోది ప్రభావశీలంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ల జీవన పరిమితి పురుషుల్లో కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.
ఈ బృందం జంతువులపై చేసిన ప్రయోగాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఉదాహరణకు క్షీరదాలను తీసుకుంటే వాటిలో కూడా మగ జంతువుల్లో ఎక్స్, వై అనే లైంగిక క్రోమోజోములే ఉంటాయి. అందువల్ల వాటి ఆయు:ప్రమాణం కూడా తక్కువే. అదే పక్షుల్లో ఆడవాటిలో జెడ్, డబ్ల్యూ అనే రెండు వైవిధ్యభరితమైన లైంగిక క్రోమోజోములుం టాయి. మగపక్షుల్లో రెండూ జెడ్ క్రోమోజోములే ఉంటాయి. ఫలితంగా పక్షుల విషయంలో మగ పక్షులే ఎక్కువ జీవనపరిమితిని కలిగి ఉంటాయి. దీన్ని బట్టి ఈ లైంగిక క్రోమోజుములే జీవుల ఆయు:ప్రమాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకలు నిర్ధారించారు.
అయితే ఈ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించడం లేదు. 'జీవన పరిమితి ఎంత కాలముంటుందనేది మనం లెక్కించలేం కాబట్టి ఈ విషయంతో ఏకీభవించలేం' అని జాన్‌సన్ పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఇడహౌకు చెందిన స్టీవెన్ ఆస్టడ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అదీగాక మార్స్యుపియల్స్‌లో(పిల్లల్ని సంరక్షించుకు నేందుకు పొట్ట కింద భాగంలో సంచీలాంటి నిర్మాణాన్ని కలిగి ఉండే క్షీరదజాతి) అంటే కంగారూ లాంటి జంతువుల్లో తండ్రి నుంచి సంక్రమించే ఎక్స్ క్రోమోజోమ్.. ఆడజంతువుల్లో ఎప్పుడూ క్రియాశీలంగా ఉండదు. అంటే వాటిలో ఏ ఎక్స్ క్రోమోజోమ్ మంచిది అని తేల్చడానికి అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఆడామగా కంగారూల్లో ఏవి ఎక్కువ కాలం జీవిస్తాయనేది తేల్చిచెప్పలేం. ఆడామగా జీవుల్లో ఆయు:ప్రమా ణాలు వివిధ జాతుల్లో వివిధ రకాలుగా ఉన్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయని, వాటిపై వివాదాలు లేకపోలేదని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.