Tuesday, November 23, 2010

' నాగవల్లి' డిసెంబర్‌ 16న విడుదల



వెంకటేష్‌ నటించిన ' చంద్రముఖి ' సీక్వెల్‌ ' నాగవల్లి' డిసెంబర్‌ 16న విడుదలయ్యే అవకాశముంది. వెంకటేష్‌ హీరోగా అనుష్క, కమలినీ ముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దాదాస్‌ తారమణులుగా ఈ చిత్రం నటించనున్నారు. ఆడియో చాలా పెద్ద హిట్‌ కావడంతో సినిమా పై కూడాప్రేక్షకల్లో అంచనాలున్నాయి. వెంకటేష్‌ అభినయం హైలైట్‌ అవుతుంది. చంద్రముఖి కంటే నాగవల్లి పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు ఏర్పడింది.

నాగపూర్‌ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం


న్యూజిలండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధిచింది. న్యూజిలాండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకు అలౌట్‌ అయ్యింది. దీంతో మూడు టెస్టుల సీరీస్‌ను 1-0 తేడాతో భారత్‌ గెలుచుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ద సీరీస్‌గా హర్భజన్‌, మ్యాన్‌ ఆప్‌ద మ్యాచ్‌గా ద్రవిడ్‌ ఎంపికయ్యారు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సౌతీ 31 పరుగులు చేసి టాప్‌ స్కోర్‌గా నిలిచాడు. భారత్‌ బౌలింగ్‌లో ఇషాంశ్‌ శర్మ , హర్బజన్‌ సింగ్‌ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఓజా, రైనా ఇద్దరు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.