Tuesday, August 31, 2010
స్పాట్ ఫిక్సింగ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫిక్సింగ్ వివాదంలో పాల్పడింది. ఇంగ్లండ్ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్‌లోని లార్డ్స్ టెస్టులో ఈ స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్ భట్‌తో సహా మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్, కీపర్ ఆక్మల్ ఈ వ్యవహరంలో దోషులుగా ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు క్రీడాకారులు కూడా సంబంధం ఉండి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసింది. మహ్మద్ అసిఫ్, మహ్మద్ అమీర్ ఇద్దరు మజీద్ సూచనల మేరకు గురువారం, శుక్రవారం నాడు మూడు నోబాల్స్ వేస్తారని వెల్లడించింది. పాక్ బౌలర్లు ఉద్దేశపూర్వకంగానే మూడు నోబాల్స్ వేయాలని మజర్ పాకిస్తాన్ క్రీడాకారుల మధ్య రహస్య అంగీకారం కుదిరిందని పేర్కొంది.
అమితాబ్ సరసన శ్రీదేవి
తెలుగు ప్రేక్షకుల అతిలోక సుందరి...శ్రీదేవి. ఆ గుర్తింపు కేవలం ఒక్క తెలుగుకే పరిమితం కాలేదు. తనవైన అందం, అభినయంతో బాలీవుడ్‌ను సైతం దశాబ్దాలపాటు ఏలుకొంది. హిందీలో అగ్ర కథానాయకుల సరసన నటించి అలరించింది. భాషా భేదం లేకుండా అందరినీ కలగలిపి ఆకట్టుకున్న శ్రీదేవి బోనీకపూర్‌తో పెళ్లయ్యాక మాత్రం సినిమాలకు దూరమైంది. అప్పట్నుంచి ఆమె పునరాగమనం కోసం అభిమానులు ఎదురుచూస్తునే ఉన్నారు. బుల్లితెర ప్రేక్షకుల కోసం మధ్యలో ఒక ధారావాహికలో కనిపించి ముచ్చట తీర్చినా...వెండితెరపై కనిపించే ప్రయత్నమేదీ చేయలేదు. ఇదిగో, అదిగో...అని.
ఊరిస్తూనే ఆమె చేయబోయే చిత్రంపై స్పష్టమైన సంకేతాలేవీ వచ్చింది లేదు. అయితే ఆవిడ అభిమానులకు ఓ శుభవార్త. వెండితెరపై వెలిగేందుకు మరోసారి సిద్ధమవుతోంది. సినిమా మాత్రం తెలుగులో కాదు. ప్రస్తుతానికి హిందీలోనే. ఇంతకీ కథానాయకుడు ఎవరను కుంటున్నారా..! అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ అంతా ఆయన్ని ఃబిగ్ బిః అని పిలుచుకుంటుందని సినీ అభిమానులకంతా తెలిసిందే. మరి అదే పేరుతో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి ఆర్.బల్కీ దర్శకత్వం వహిస్తున్నారు.

Subscribe to:
Posts (Atom)