సిని నిర్మాత మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు దాదాసాహేబ్‌ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. 2009 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో ఎనలేని కృషి చేసినవారిని కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో గౌరవిస్తుంది. అవార్డుకింద 10 లక్షల రూపాయలు, స్వర్ణ కమలం అందజేస్తారు. ఫాల్కే పురస్కారానికి ఎంపికను దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది. అక్టోబర్‌లో జరుగనున్న జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా రామానాయుడు ఫాల్కే అవార్డు అందుకోనున్నారు.