వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య బారబతి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా జయభేరి మోగించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ పోటీ చూసేందుకు తొలినుంచి ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. టాస్‌నెగ్గిన ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ వెస్టిండీస్‌ను నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు పడగొట్టి 211 పరుగలకే కట్టడి చేసింది. ఆ తరువాత 212 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒకదశలో 60 పరుగలకే 5 వికెట్లు కోల్పోయి చతికిలపడింది. ఆ దశలో రోహిత్‌శర్మ, జడేజాలు నిలదొక్కుకుని భారత్ స్కోరును నెమ్మదిగా పెంచారు. చివర్లో వికెట్లు వడివడిగా పడినప్పటికీ భారత్ 9 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి ఒక వికెట్టు వియాన్ని సాధించింది. రోహిత్ 72 పరుగులు చేసి వన్డేల్లో 9వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.