విరాట్
కోహ్లి, అనుష్క శర్మ మళ్లీ ఒక్కటవుతున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే
అలాగే అనిపిస్తోంది మరి. అనుష్క నుంచి విడిపోగానే కోహ్లి.. ఆమెను ట్విట్టర్,
ఇన్‌స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో అనుసరించడం మానేసిన సంగతి తెలిసిందే.
ఐతే ఆదివారం అనుష్క పుట్టిన రోజు సందర్భంగా విరాట్ మళ్లీ ఆ రెండు చోట్లా
ఆమెను అనుసరించడం మొదలుపెట్టాడు. ఇటీవల అనుష్కను సామాజిక మాధ్యమాల్లో
అభిమానులు తిట్టిపోస్తుండటంపై విరాట్ మండిపడుతూ ఆమెకు మద్దతుగా
నిలవడం.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ విందులో పాల్గొనడం తెలిసిందే. తాజా
పరిణామాలు కోహ్లి, అనుష్క మళ్లీ ఒక్కటవుతున్న సంకేతాల్నిస్తున్నాయి.