బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి కూతురైంది. ప్రీతి తన ప్రేమికుడు, అమెరికాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు జీని గుడెనఫ్ ను వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 29న లాస్ ఏంజిలెస్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వివాహానికి ప్రీతి, గుడెనఫ్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. ఏడాదిన్నరగా ప్రీతి జింతా, గుడెనఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వచ్చినా ప్రీతి వీటిని ఖండించింది. అయితే లాస్ ఏంజిలెస్ లో ప్రీతి తన బాయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీతికి సన్నిహితంగా ఉండే సుజానే ఖాన్, సురిలీ గోయెల్ లాస్ ఏంజిలెస్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రీతి ఏప్రిల్ లో ముంబైకు రానుంది. ఈ దిల్ సే హీరోయిన్ ప్రముఖ వ్యాపారవేత్త నెస్ వాడియాను వివాహం చేసుకోనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను కొనుగోలు చేశారు. అనంతరం వారిద్దరి మధ్య వివాదం ఏర్పడటం, పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.
Tuesday, March 1, 2016
బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న ప్రీతి జింతా

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment