భారత్, పాకిస్తాన్ ప్రపంచకప్ మ్యాచ్‌కు ముందు ఉన్న ఉత్కంఠను కార్పొరేట్ కంపెనీలు కూడా వాడుకుంటున్నాయి. తాజాగా నెస్లేసంస్థ తమ ఉత్పత్తి కోసం పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, అతని భార్య (భారత టెన్నిస్ స్టార్) సానియా మీర్జాలతో కలిసి ఓ యాడ్‌ను రూపొందించింది. ఇందులో ఇద్దరూ తమ తమ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులే గొప్ప అంటూ వాదనకు దిగుతారు. సచిన్ స్ట్రయిట్ డ్రైవ్ గొప్పని సానియా అంటే... అక్తర్ యార్కరే గ్రేట్ అని మాలిక్ అంటాడు. ప్రస్తుతం ఈ యాడ్ పాకిస్తాన్‌లో ప్రసారం అవుతోంది.
No comments:
Post a Comment