Thursday, February 3, 2011

గోపీచంద్‌ ' మొగుడు ' గా అనుష్క రేడీ


' మొగుడు ' పేరుతో గోపీచంద్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం నల్లుమలుపు శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన అనుష్క ఎంపికయ్యింద తెలుస్తోంది. వీరిద్దరూ జంటగా నటించిన ' లక్ష్యం', శౌర్యం ' చిత్రాలు మంచి విజయాని సాధించాయి. ఈ రెండు చిత్రాల్లో నటించిన ఈ జంట మధ్య ఆన్‌స్క్రీన్‌ ఆండ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా కుదిరిందని, ఇద్దరూ పెళ్లి చేసుకఁనే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఆ మద్య పుకార్లు సైతం వ్యాపించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంభినేషన్‌లో మరో సినిమా నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్‌ సుసాధ్యం చేస్తారని తెలుస్తోంది.

' జై బోలో తెలంగాణ ' సినిమా నేడే విడుదల

 వివాదాస్పదంగా మారిన ' జైబోలో తెలంగాణ ' లభిచడంతో ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల సినిమా విడుదలకు సిద్దమైంది. సెన్నార్‌ బోర్డ్‌లో కొందరు సీమాంధ్రులు సినిమా విడుదలకు అడ్డుకట్ట వేశారంటూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తడం సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా ' జై బోలో తెలంగాణ ' సినిమా కి సెన్సార్‌ ఇబ్బందులు ఎదురయిన సంగతి విదితమే. దీంతో ' జై బోలో తెలంగాణ ' సినిమా విడుదలకు మార్గం సుగమమయింది.

ఆ వయసు ఇంకా రాలేదు

 సైల్‌ అలీఖాన్‌తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి ప్రస్తావన సైఫ్‌ ఎన్ని సార్లు తెచ్చినా.. కరీనా నుంచి మాత్రం మౌనమే సమాధానమవుతోంది. పెళ్లి చేసుకునే వయసు ఇంకా రాలేదు. కెరీర్‌ విషయంలో మంచి స్థానం కోసం కృషి చేసే వయసు వచ్చిందని మాత్రం చెప్పగలను. ప్రస్తుతం తనది కెరీర్‌ కోసం కష్టపడే వయసు తప్ప పెళ్లిచేసుకునే వయసు కాదని చెబుతోంది ఈ సుందరి. అందుకే ప్రస్తుతానికి పెళ్లి ' క్యాన్సల్‌ ' అని చెబ్బుతుంది.

ప్రపంచకప్పే అతనికి మేమిచ్చే బ హుమతి

బ హూశా అతనికి చివరి ప్రపంచకప్‌ ! టన్నులకొద్దీ పరుగుల చేసినా, ప్రతి రికార్డునూ తన సొంతం చేసుకున్నా ప్రపంచకప్‌ అందుకోలేకపోవడం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వెలితే : అందుకే దోనీసేన. ఈ ప్రపంచకప్‌ అతనికి ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేయాలనుకుటోంది. మేమందరం కూడా అతని ( టెండ్కూలర్‌ను ) బాగా అభిమానిస్తాం. బహూశా ఈ వర్డల్‌కప్పే అతనికి చివరిదికావచ్చు. అతను ఇంకా మరెన్నో టోర్నిల్లో పాల్గొనాలనే కోరిక ఉన్నా, నిజ జీవితంలో మాత్రం అది అసాధ్యం. వరల్డ్‌ కప్‌ను సాధించే సత్తా జట్టుకు ఉందని... ఒక జట్టుగా రాణిస్తే ... వరల్డ్‌కప్‌ను సాధించే అవకాశాలు భారత్‌కు మెరుగ్గా ఉంటాయని ధోని అన్నాడు.

' బొబ్బిలి ' రానా

 ' బొబ్బిలి రానా ' తాజాగా ఈ సినిమా  రీమేక్‌ ( ? ) కి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో బాబాయ్ వెంకటేష్‌ హీరోగా నటిస్తే ... తాజాగా అబ్బాయ్ రాణా ఆ పాత్ర పోషించడా నికి రెడీ అవుతున్నాడట. నిర్మాత, రానా తండ్రి సురేష్‌బాబు అందుకు సంబందిచిన సంగతులపై పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. బి. గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా లో అప్పట్లో కథానాయికగా దివ్వభారతి నటించింది.