ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇటీవల వెలుగు చూస్తున్న వివాదాలను విస్తుపోయేలా చేస్తున్నాయి. 2008లో పరిమిత ఓవర్లలో ఐపిఎల్ అట్టహాసంగా ఆరంభమైంది. తొలి ఐపిఎల్ ప్రారంభమూ క్రికెట్ అభిమానుల క్రీడానందానికి పర్యాయపదమా అన్న భావన కలిగించింది. కానీ ఒక దాని వెంట ఒకటిగా వివాదాలు తన్నుకొస్తున్న తీరు అన్ని వర్గాలనూ నీరసింపజేస్తోంది. ఒక్క మాటలో వినోదానికి డబ్బు జబ్బు తోడైతే ఏం జరుగుతుదో అదే జరుగుతోంది. ముఖాముఖి ముష్టిఘాతాలకు సిద్ధపడే ఫ్రాంచైజీలు, పంతాలతో మైదానంలోనే పరస్పర దూషణ-భాషణాలకు దిగబడే ఆటగాళు ్ల అన్నిటిని మించి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఐపిఎల్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.ఐపిఎల్‌ల్లో చోటు చోసుకున్న ప్రధాన వివాదాలు పరిశీలిస్తే...
స్పాట్ ఫిక్సింగ్ : ఐపిఎల్ ప్రతిష్టకు మొదటి గండం మ్యాచ్ ఫిక్సింగ్ రూపంలో ఎదురైంది. ఒక ప్రైవేటు టివి ఛానలు నిర్వహించిన అపరాధపరిశోధనలో ఐపిఎల్ అటగాళ్లు మైదానం వెలుపల డబ్బుకు అమ్ముడుపోయారని తేలింది. జట్ల యాజమాన్యాలకు ఇందులో భాగస్వామ్యం ఉందని, ఫ్రాంఛైజీలు తక్కువ తినలేదని తేల్చింది. సదరు మీడియా సంస్థ విడుదల చేసిన వీడియోలో మ్యాచ్ మధ్యలో నోబాల్ వేసే అంశంపై ఆటగాళ్లు చర్చలు జరపడం ఉంది. దీనితో ప్రమేయమున్న ఐదుగురు ఆటగాళ్ల మీద వేటు వేస్తూ ఇండియన్ క్రికెట్ బోర్డ్ కఠినంగా వ్యవహరించింది. కాగా ఈవివాదంపె దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను అందజేసే బాధ్యతను బిసిసిఐ అవినీతి వ్యతిరేక విభాగ అధిపతి రవి సవానీకి అప్పగించారు.
లలిత్ మోడీ ఉద్వాసన : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటుకు సూత్రధారి లలిత్‌మోడీ అన్న సంగతి తెలిసిందే. ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన అభియోగంతో పాటుగా బెట్టింగు, మనీ లాండరింగు వంటి తీవ్ర అబియోగాలు వెలుగు చూడటంతో 2010లో ఐపిఎల్ ఛైర్మన్ పదవి నుంచి లలిత్ మోడీకి ఉద్వాసన పలికారు. ఒక రకంగా మోడీ తన ఉద్వాసనకు తనే బీజాలు వేసుకున్నాడని చెప్పాలి. ఐపిఎల్‌లోకి కొత్తగా ప్రవేశించిన కొచ్చి టస్కర్స్ కేరళ రహస్య ఒప్పందాలను ఉల్లంఘించిందంటూ తన ట్విటర్‌లో ఆయన స్వయంగా రాసుకున్న అంశాలే తుదకు ఉద్వాసనకు దారి తీశాయి. నాటి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ శశిథరూర్ పదవికి ఎసరు తెచ్చాయి. ఇంత జరిగినా తప్పేమీ జరగలేదంటూ మోడీ వితండ వాదన కొనసాగించడం విశేషం.
ముష్టిఘాతాలు : ఐపిఎల్ ఆరంభం ఎంత ఘనంగా ప్రారంభమైందో అంతే శీఘ్రంగా వివాదాలను నమోదు చేసుకుంది. ఏప్రిల్ 25న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోని ఆటగాడు ఎస్ శ్రీశాంత్‌ను ముంబయి ఇండియన్స్ ఆటగాడు హర్జజన్‌సింగ్ లాగి లెంపకాయకొట్టాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన దశలో దురదృష్టమంటూ హర్భజన్‌ను అనడమే శ్రీశాంత్ తప్పిదంగా తుదకు తేలింది. వీడియోక్లిప్పింగుల పరిశీలన అనంతరం హర్భజన్ సింగ్‌ను తొలి ఐపిఎల్‌లో జరగాల్సిన 11 మ్యాచ్‌ల్లో ఆడటానికి వీల్లేదంటూ సస్పెండ్ చేశారు.
అత్యాచార అభియోగం : రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్టులోని ల్యూక్ పోమర్స్‌బాచ్ మీద అత్యాచార అభియోగం నమోదైంది. భారత సంతతి అమెకన్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అభియోగంపై పోమర్స్‌బాచ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు.
విందు విలాసాలు : ఐపిఎల్‌లో మ్యాచ్ ముగిసాక జరిగే విందులు విలాసాలకు ఒకప్రత్యేకత వుంది. ఏమిటంటారా ..హద్దుపద్దూ లేకుండా పెచ్చరిల్లడమేనని చెప్పవచ్చు. విందులో పాల్గొనే ఏ ఆటగాడినైనా లేదా ఏ బాలీవుడ్ నటుడితోనైనా కరచాలనం చేయవచ్చు. దీనికి భిన్నమైన కథనం దాగుందని దక్షిణాఫ్రికాకు చెందిన ఛీర్‌లీడర్ తన బ్లాగులో పేర్కొనే వరకు సమాజానికి తెలయదు. 2011లో ఒక పార్టీ అనంతరం ఛీర్ లీడర్లను నడిచే శృంగార భామలుగానూ క్రికెటర్ల హద్దులు దాటిన ప్రవర్తనను గేబ్రియల్ల పస్కలోటో సవిరంగా అభివర్ణించారు. అంతే రహస్యాలను రచ్చ చేస్తోందంటూ ఆమెను ఇంటికి సాగనంపారు. తప్ప ఆమె తన బ్లాగులో రాసుకున్న కథనాలు వాస్తవాలా కాదా అనే అంశాన్ని పట్టించుకోక పోవడం నిజంగా విశేషమేనని చెప్పాలి. ఉద్వాసనకు గురయిన లలిత్ మోడీ స్థానంలో నూతన కమిషనరుగా బాధ్యతలు చేపట్టిన చిరయూ అమీన్ వచ్చీ రావడంతోనే ఆట తరువాత విందు విలాసాలకు తెర దించేశారు.
స్పాట్ ఫిక్సింగ్ : ఐపిఎల్ ప్రతిష్టకు మొదటి గండం మ్యాచ్ ఫిక్సింగ్ రూపంలో ఎదురైంది. ఒక ప్రైవేటు టివి ఛానలు నిర్వహించిన అపరాధపరిశోధనలో ఐపిఎల్ అటగాళ్లు మైదానం వెలుపల డబ్బుకు అమ్ముడుపోయారని తేలింది. జట్ల యాజమాన్యాలకు ఇందులో భాగస్వామ్యం ఉందని, ఫ్రాంఛైజీలు తక్కువ తినలేదని తేల్చింది. సదరు మీడియా సంస్థ విడుదల చేసిన వీడియోలో మ్యాచ్ మధ్యలో నోబాల్ వేసే అంశంపై ఆటగాళ్లు చర్చలు జరపడం ఉంది. దీనితో ప్రమేయమున్న ఐదుగురు ఆటగాళ్ల మీద వేటు వేస్తూ ఇండియన్ క్రికెట్ బోర్డ్ కఠినంగా వ్యవహరించింది. కాగా ఈవివాదంపె దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా సమగ్ర నివేదికను అందజేసే బాధ్యతను బిసిసిఐ అవినీతి వ్యతిరేక విభాగ అధిపతి రవి సవానీకి అప్పగించారు.
లలిత్ మోడీ ఉద్వాసన : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటుకు సూత్రధారి లలిత్‌మోడీ అన్న సంగతి తెలిసిందే. ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన అభియోగంతో పాటుగా బెట్టింగు, మనీ లాండరింగు వంటి తీవ్ర అబియోగాలు వెలుగు చూడటంతో 2010లో ఐపిఎల్ ఛైర్మన్ పదవి నుంచి లలిత్ మోడీకి ఉద్వాసన పలికారు. ఒక రకంగా మోడీ తన ఉద్వాసనకు తనే బీజాలు వేసుకున్నాడని చెప్పాలి. ఐపిఎల్‌లోకి కొత్తగా ప్రవేశించిన కొచ్చి టస్కర్స్ కేరళ రహస్య ఒప్పందాలను ఉల్లంఘించిందంటూ తన ట్విటర్‌లో ఆయన స్వయంగా రాసుకున్న అంశాలే తుదకు ఉద్వాసనకు దారి తీశాయి. నాటి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి డాక్టర్ శశిథరూర్ పదవికి ఎసరు తెచ్చాయి. ఇంత జరిగినా తప్పేమీ జరగలేదంటూ మోడీ వితండ వాదన కొనసాగించడం విశేషం.
ముష్టిఘాతాలు : ఐపిఎల్ ఆరంభం ఎంత ఘనంగా ప్రారంభమైందో అంతే శీఘ్రంగా వివాదాలను నమోదు చేసుకుంది. ఏప్రిల్ 25న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులోని ఆటగాడు ఎస్ శ్రీశాంత్‌ను ముంబయి ఇండియన్స్ ఆటగాడు హర్జజన్‌సింగ్ లాగి లెంపకాయకొట్టాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన దశలో దురదృష్టమంటూ హర్భజన్‌ను అనడమే శ్రీశాంత్ తప్పిదంగా తుదకు తేలింది. వీడియోక్లిప్పింగుల పరిశీలన అనంతరం హర్భజన్ సింగ్‌ను తొలి ఐపిఎల్‌లో జరగాల్సిన 11 మ్యాచ్‌ల్లో ఆడటానికి వీల్లేదంటూ సస్పెండ్ చేశారు.
షారుఖ్ జగడం : ఇక తాజా వివాదం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ది. కొల్‌కత నైట్ రైడర్స్‌కు షారుఖ్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 16న ముంబయి ఇండియన్స్ జట్టు మీద తన జట్టు గెలుపొందిన తరువాత ఈ జగడం చోటు చేసుకుంది. ముంబయి క్రికెట్ అసొసియేషను అధికారులో షారుఖ్ ముఖాముఖి తలపడినట్లుగాను దుర్భాషలాడినట్లుగాను సమాచారం. మ్యాచ్ జరిగే సమయంలో వాస్తవానికి షారుఖ్ స్టేడియంలోనే లేడు. ఆట ముగిశాక ఆటను తిలకించే తనకుమార్తెను తీసుకు వెళ్లేందుకు స్టేడియానికి వచ్చాడు. పనిలో పనిగా ఆటగాళ్లను అభినందించాడు. అంతే అక్కడి భద్రత సిబ్బందితో జగడం మొదలైంది. దీనిపై షారుఖ్ మీద ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. తన కుమార్తె కూడా ఉన్న పిల్లల బృందం మీద స్టేడియం భద్రత సిబ్బంది బలప్రయోగానికి దిగారనేది షారుఖ్ వాదన. ఫిర్యాదు తదితర అంశాలను పరిశీలించిన తరువాత షారుఖ్‌ను ఐదేళ్లపాటు ఎంసిఎలో ప్రవేశించకుండా నిషేదం విధిస్తున్నట్లు ఎంసిఎ అధ్యక్షుడు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఎంసిఎ పాలక మండలిలో షారుఖ్ ఖాన్ స్వయంగా సభ్యుడు కావడం విశేషం.