అతి కొద్ది కాలంలో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హాట్ బ్యూటి
అనుష్క శర్మ. హీరోయిన్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నిర్మాణ రంగం మీద
దృష్టిపెట్టిన ఈ భామ, వరుసగా మూడు సినిమాలు నిర్మించడానికి ప్లాన్
చేసుకుంటోంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'ఎన్ హెచ్ 10' సినిమాతో
నిర్మాతగా మారిన అనుష్క, అదే సినిమాలో నటనతో కూడా ఆకట్టుకుంది. అదే ఊపులో
ఒకేసారి మూడు సినిమాల నిర్మాణానికి రెడీ అవుతోంది అనుష్క శర్మ.
ఈ సినిమాలు, నా కోసం నేను నిర్మించుకుంటున్నా అంటున్న అనుష్క ఇప్పటికే
రెండు సినిమాల కథా కథనాలు కూడా రెడీ అయ్యాయని, మరో సినిమాకు సంబందించిన కథా
చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ మూడు చిత్రాల్లో, ఎన్ హెచ్ 10
సినిమాకు దర్శకత్వం వహించిన నవదీప్ సింగ్ ఒక సినిమాను డైరెక్ట్ చేస్తుండగా,
మిగతా రెండు సినిమాల ద్వారా అన్షయ్ లాల్, అక్షంత్ వర్మలు దర్శకులుగా
పరిచయం అవుతున్నారు.
Tuesday, December 8, 2015
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రెండు కొత్త జట్లు వచ్చాయి. వచ్చే రెండు సీజన్లలో పుణె, రాజ్ కోట్ ఫ్రాంచైజీలు ఆడుతాయని మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. బెట్టింగ్ ఉదంతంలో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో ఈ రెండు జట్లను తీసుకున్నారు. పుణె టీమ్ ను 16 కోట్ల రూపాయలకు న్యూ రైజింగ్ (సంజీవ్ గొయెంకా) సొంతం చేసుకోగా, రాజ్ కోట్ జట్టును 10 కోట్ల రూపాయలకు ఇంటెక్స్ దక్కించుకుంది. చెన్నై, రాజస్థాన్ జట్లలోని టాప్-5 ఆటగాళ్లను.. పుణె, రాజ్ కోట్ ఎంపిక చేసుకునే అవకాశముంది. ఈ నెల 15న ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.
Subscribe to:
Posts (Atom)